డేర్ టు క్వశ్చన్ (Dare2Question)

"Injustice anywhere is a threat to justice everywhere" - Martin Luther King Jr.

Tuesday, May 29, 2012

గురివింద సామెతను గుర్తు చేస్తోన్న ఈనాడు, జ్యోతి

     మన రాష్ట్రంలో, ఆమాటకొస్తే మొత్తం దేశంలో ఇప్పుడు ఓ కొత్త సిద్ధాంతం నడుస్తోంది. నానలుపు సంగతి  తర్వాతగానీ ముందు నీ నలుపు సంగతి చెప్పమన్న గురివింద సామెతలాగ.  పొలిటీషియన్ నుంచి పాలవాడిదాకా ఇదే వరస. పాలవాణ్ణి ఏరా! ఇంతలా నీళ్ళెందుకు కలుపుతున్నవురా అంటే, పోండయ్యా ఏదో ముప్పావు లీటర్లో పావు లీటర్ నీళ్ళు కలిపితేనే అంతలా గగ్గోలెడతారేంటి? నేనేమన్నా మన లీడర్లలా అసలు పాలే లేకుండా నీళ్ళుపోస్తున్నానా ఏంటి?? అని ప్రశ్నిస్తున్నాడు. పైగా తనదేమంత పెద్ద తప్పు కాదు ఫలానావాడితో పోలిస్తే అంటాడు:)
   ఇంతకీ విషయం ఏంటంటే - ఓపక్క కంపెనీ పెట్టీ పెట్టగానే, లాభల్లాంటివేవీ ఆర్జించకుండానే 10రూపాయల షేరును 350కి ఎల కొంటారు? మేళ్ళు పొందినవారే అలా చేసారని రామోజీ గుండెలు బాదుకుంటుంటే ఇక జగన్ కూడా ఈనాడు ప్రస్తావన తెచ్చి నష్టాలలో ఉన్న ఈనాడు షేర్ ను ఐదు లక్షల ఇరవైఎనిమిదివేలకు విక్రయిస్తే లేని తప్పు, తాను తన సాక్షి షేర్ ను మూడు వందల ఏభై రూపాయలకు అమ్మితే తప్పా అని కోర్టులో స్వయంగా చెప్పడం విశేషం.
    ఒకరకంగా ఇది మంచి ప్రశ్నే కావచ్చు. కానీ - ఇద్దరూ చేసింది తప్పే అనీ, ఎవడిస్థాయిలో వాడు మతలబులు చేసారనీ నమ్మే జనాలక్కావలసింది అదికాదు. వాడెలా చేసాడో వీడూ,వీడెలా చేసాడో వాడూ నిరూపిస్తే ఒకడి నెత్తిన  ఇంకొకడు భస్మాసుర హస్తం పెట్టుకున్నట్లవుద్ది. కానీ అలా చెయ్యరు. ఇక జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పేంత తక్కువస్థాయి కాదు రామోజీదన్నట్లు ముందుకొచ్చాడు ఒక ఎల్లో బ్రదర్ - కేశవ్. ఈనాడు ముప్పై ఐదేళ్లుగా శ్రమించి అభివృద్ది చెంది,ఆస్తుల బేస్ తయారు చేసుకోగా,సాక్షి అలాంటిదేమీ లేకుండా ముడుపుల ఆధారంగా పెట్టుబుడులు పెట్టిందని టిడిపి నేత కేశవ్ పేర్కొన్నారు.
      ఇలాంటిదే మరో ఘటన - ప్రధానిపై అన్నా బృందం ఆరోపణలు చేస్తే ఖండిచడానికి ముందుకొచ్చింది అవినీతికి అసలు సిసలు డిక్షనరీ అర్ధం లాలూ.
     మరోపక్క తన ఇలాకాలో పనిచేసే ఉద్యోగులను వలసకూలీలకన్నా నీచంగా చూసే, సహేతుకమైన వేతనాలివ్వాలంటూ వేజ్‌బోర్డ్ సైతం ఎన్నోసార్లు చేసిన సిఫార్సులను తుంగలో తొక్కిన రామోజీ మొన్న సాక్షి ఖాతాల స్థంబన, ఆస్థుల ఎటాచ్‌మెంట్ వార్తలురాగానే ఏకంగా ఇరవై శాతం జీతాలు పెంచాడట. ఇది ఎంత పైశాచికానందమో కదా! అదేమి విచిత్రమో కానీ ఒకప్పుడు సాక్షి పత్రిక పెట్టినందువల్లనే రామోజీ జీతాలు పెంచడం, ఇప్పుడదే సాక్షి మూతపడుతుందనే భ్రమతో మళ్ళీ జీతాలు పెరగడంతో ఈనాడు ఉద్యోగులు చచ్చి బ్రతికిన వై.ఎస్ నూ జైలుకెళ్ళిన జగన్నే ఎక్కువ తలచుకుంటున్నారట జీతాలిచ్చే రామోజీకి బదులుగా!!
    తనకు తాను మహా మేధావినని ఊహించుకునే నేరో హార్ట్(Narrow Heart) ఆర్కే పత్రిక ఏకంగా జగన్ ను ఇంటరాగేట్ చేసింది తానే అన్నట్లు "ఆదివారమ్ విచారణలో నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ ను ఉద్దేశించి నీవల్లే ఇదంతా వచ్చిందని అనడంతో జగన్ ఆయనపై ఫైర్ అయ్యారని, అంతేకాక సిబిఐ పై కూడా ఆయన దురుసుగా వ్యవహరించారని" వ్రాయడం, ఆపైన అటు జగన్ తరపు వారు ఇటు నిమ్మగడ్డ ప్రసాద్ తరపు వారు ఇద్దరూ ఈ కధనాన్ని తీవ్రంగా ఖండి0చడం ఆ పత్రిక గాలితీసినట్లయింది. (మొదటి రోజు నిమ్మగడ్డ ప్రసాద్ ను , జగన్ ను ఇద్దరిని కలిసి విచారించిన మాట నిజమే. కాని ఆదివారం నాడు అసలు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టలేదని ఇరువర్గాల వారు చెపారు).
    ఇలా ఎవడికి కావలిసిన గాలి వార్తలను వాడు సృష్టించి రాస్తున్నారుగానీ జనాలకు నిజాలు చెప్పేవాళ్ళు కరువైపోయారు!!!

4 comments:

mmd said...

reddy garu, sh.... jagratta. meeru ilantivi raaste jagan vidheyulu anna mudra padipotundi. meeru cheppe jagan ki siksha padaali, at the same time migataa vedavalaki siksha padaali anna principle kaasta meeru migataavaallaki siksha padaledu kaabatti jagan ki kudaa siksha padoddu ani antunnarani pracharam cheyyagalaru.

ayinaa vellantaa dongalu. anduke mudu jagratta gaa migataa vaallu dongalani arustuntaaru. tarvaata malla kalustaaru. intakumundu rajakeeya bedhabhi prayaalu kaani vyakthigatangaa yemi levu antaaru. naakaite vaatimadya tedaa teleedu.

good posts. keep going.

mmd said...

reddy garu, sh.... jagratta. meeru ilantivi raaste jagan vidheyulu anna mudra padipotundi. meeru cheppe jagan ki siksha padaali, at the same time migataa vedavalaki siksha padaali anna principle kaasta meeru migataavaallaki siksha padaledu kaabatti jagan ki kudaa siksha padoddu ani antunnarani pracharam cheyyagalaru.

ayinaa vellantaa dongalu. anduke mudu jagratta gaa migataa vaallu dongalani arustuntaaru. tarvaata malla kalustaaru. intakumundu rajakeeya bedhabhi prayaalu kaani vyakthigatangaa yemi levu antaaru. naakaite vaatimadya tedaa teleedu.

good posts. keep going

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Nice post. I agree with you to a large extent.

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) said...

@Mouli
do u think equality before law is being followed in Jagan's case? Don't u think CBI is being used as a pawn to settle congress's scores against Jagan. It doesn't mean I am supporting Jagan. He deserves a much severe and instant punishment than putting behind bars. he must have been hanged by now. but, why did Azad say he would have become a Central Minister/ state C.M in long run had he been in Congress??