డేర్ టు క్వశ్చన్ (Dare2Question)

"Injustice anywhere is a threat to justice everywhere" - Martin Luther King Jr.

Sunday, December 30, 2012

స్త్రీమూర్తులపై అకృత్యాలను అరికట్టమని రాష్ట్రపతికీ, సుప్రీం కోర్టుకీ ఈ అభ్యర్ధన పత్రం పై సంతకం చేసిపంపుదాం రండి.

    న్యాయ వ్యవస్ధకి మన అభ్యర్ధన, ఉత్తరం/ mail రూపంలో మన ఆక్రోషాన్ని పంపుదాం. వేలాది మంది అలా సుప్రీమ్ కోర్ట్ కి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపితే నేరుగా స్పందన తెలుస్తుంది. ఈ  లింక్ నొక్కి మీ స్పందన తెలపండి.

బొత్స లాంటి తెగబలిసిన మద్యం మాఫియాగాళ్ళు ఏలే ఈ రాజ్యంలో ఏ రక్షణలు ఆశించగలం? పిచ్చి తల్లులూ..ఆడ పిల్లలూ మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అమ్మా! R.I.P Nirbhaya (Amanath)

   (Note:  రాష్ట్రపతికీ, న్యాయ వ్యవస్ధకి మన అభ్యర్ధన, ఉత్తరం రూపంలో మన ఆక్రోషాన్ని పంపుదాం. వేలాది మంది అలా సుప్రీమ్ కోర్ట్ కి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపితే నేరుగా స్పందన తెలుస్తుంది. ఈ లింక్ నొక్కి మీ స్పందన తెలపండి) పదమూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి అలసి సొలసి ఆఖరి శ్వాస విడిచిన గ్యాంగ్‌రేప్‌ బాధిత యువతి (Amanath) కోసం ప్రార్ధించని పెదవులూ, చెమ్మగిల్లని కళ్లేవీ ఈ దేశంలో వుండవు. దేశంలో ఇంత కదలిక రావడానికి కారణమైన ఢిల్లీ యువతి అక్షరాలా అమరజీవిగా మిగిలిపోతుంది.
      ఈ రాక్షస కాండపై రగిలిన ఆగ్రహం, పెల్లుబికిన యువచైతన్యం, మహిళలపై దుర్మార్గాలు సాగించే వారికి ఒక హెచ్చరిక కావాలనీ,నిత్యం మహిళా జపం చేస్తూనే వారి రక్షణ పట్ల ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ చాలా సందర్భాల్లో నేరస్తులకు గొడుగు పట్టే పాలకవర్గాలను కనువిప్పు కలిగించాలనీ, కాపాడకపోగా కలుషిత సంసృతిని వ్యాపింపచేస్తూ ఆ పైన అమ్మాయిలే అన్నిటికీ బాధ్యులని అవాకులు చవాకులు పలికిన బొత్స లాంటి నీచ నాయకులకు ఒక గుణపాఠం చెబుతుందనీ ఆశిద్దాం.
     ఎవరెన్ని చెప్పినా మన దేశంలో ఆడపిల్లల్ని ఆటవస్తువుల్లా చూసే ఆటవిక లక్షణం అంతకంతకూ పెరిగిపోతోందన్నది నిర్వివాదాంశం. ఇందుకుగల కారణాలను అణ్వేషించి దీర్ఘకాలిక చర్యలకుపక్రమిచాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసి మర్చిపోయే గజనీ టైపు రాజకీయ నేతలూ, అత్యాచారమైనా హత్య అయినా సెన్సేషనలైజ్ చేసి టీఆర్పీలకోసం వాడుకుందామనుకునే హ్రస్వదృష్టిగల మీడియాలను దాటి ఈసారి యువకెరటాలు తమచేతుల్లోకి తీసుకుని డిల్లీ పెద్దలను, యావత్తు దేశాన్నీ ఇంకెంతోకాలం ఇలాంటివాటిని సహించేదిలేదంటూ చర్యలకుపక్రమించేలా చేస్తున్న తీరు హర్షించదగ్గదే. ఏ ప్రజాస్వామయమైనా ప్రజలు - ముఖ్యంగా యువత చైతన్యమైనప్పుడే పరిఢవిల్లుతుంది. మన ప్రజాస్వామ్యానికి కూడా అలాంటి రోజులు రావడం సంతోషదాయకం!
     ఇటు నాయకుల్లో, అధికారుల్లో కొందరు ఇంతటి విషాదకర సంఘటణలు జరిగినప్పుడు అసలు విషయాన్ని పట్టించుకోకుండా తామూ తండ్రులమేననీ, తమకూ ఆడబిడ్డలున్నరనే ఇంగితం లేకుండా తమ స్వభావసిద్ధమైన లేకి బుద్ధులు ప్రదర్శించడం ఒక కోణమైతే ఫేస్‌బుక్కులూ, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కులలో కొందరు ఆడవాళ్ళతో సహా చాలామంది ఆడవాళ్ళదే తప్పనేలా రకరకాల వ్యాఖ్యలు చెయ్యడం ఆశ్చర్యమనిపిస్తుంది.
మరోవైపు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కొందరు యువతులు చేతబట్టిన ప్లకార్డులుకూడా కొంత అసాధారణంగ అనిపించక మానవు. ఉదాహరణకు "ఎలాంటిబట్టలు వేసుకోవాలో నాకు చెప్పకండి, రేప్ చెయ్యొద్దనిమత్రమే వాళ్ళకు చెప్పండి!!" "ఒకవేళ నేను ఒంటిమీద నూలు పోగులేకుండా రోడ్లపై తిరిగినా నన్ను రేప్ చేసే హక్కుమాత్రం మీకు లేదు". ఇలాంటి వ్యాఖ్యలు స్లోగన్లవరకుమాత్రమే పరిమితమైనా కొంతమేర నేటి యువతుల అసాధారణ ఆలోచనా విధానాన్నికూడా సూచిస్తున్నాయేమో అనిపిస్తుంది. పురుషుడిలాగానే తనకూ ఎలాగైనా ఉండగలిగే స్వేచ్ఛ ఉండాలని స్త్రీ కోరుకోవడంలో తప్పు ఉండకపోవచ్చు కానీ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా నడచుకొని తనను తాను అపాయాలకు దూరంగా ఉంచుకోవాల్సిన విజ్ఞత అన్నిటికన్నా ముఖ్యం కాదా?      
     మన దేశం లో స్త్రీలు ముఖ్యం గా గుర్తుంచుకోవలసింది - ఇది పురుష అహంకార సమాజమని. రేప్ లు జరుగుతాయి అనె ప్రమాదాన్ని ఊహించినపుడు, సాద్యమైనంతవరకు ,అన్నా,తమ్ముడూ అనుకుంటూ బ్రతిమాలే దోరణిలో ఆ విపత్కర పరిస్తితి నుండి బయటపడతానికి ప్రయత్నించాలి. ఒక వేలా ఒక్కరె ఉండి తన దగ్గర ఆయుదమేదయినా ఉంటే దానితో వాడి మీద దాడి చేయ వచ్చు. అవసరమయితే ప్రాణాలు తీయవచ్చు. ఇది చట్ట సమ్మతమే.
      కాని ఎట్టి పరిస్తితిలో పురుష అహంకారాన్ని రెచ్చ గొట్టే మాటలు మాత్రం అనరాదు. డిల్లీ యూవతి విషయంలో అదే జరిగింది. వాళ్ళు ఆరుగురున్నారు. తన ఫ్రెండుతో ఉన్న ఈమె వాళ్ళనెదిరించలేననే విషయం గుర్తెరిగి వాళ్ళు వెకిలి చేష్టలు మొదలు పెట్టగానే, తన మితౄడు వాళ్ళతో గొడవ పడతూంటే ఏదో ఓకటి సర్ది చెప్పి బస్సు దిగేసే అవాకాశం ఉండేదేమో?  కానీ ధైర్యస్తురాలైన ఆ అమ్మాయి సహజంగానె ఎదురు తిరిగింది. తిట్టడం, చేతులు కొరకడం జరిగింది. ఆ దెబ్బతో ఆఫ్ట్రాల్ ఆడది మనల్ని ఎదిరిస్తుందా అనే పురుష అహంకారం వారి లో నిద్ర లేచింది. దానితో మృగాళ్ళగా మారి, ఆమె ప్రెండ్ ని కొట్టి పడేసీ, అమే మీద విచక్షణా రహితంగా దాడి చేశారు. సుమారు అర గంట  అత్యాచరకాండ తర్వాత కుక్కల్ని విసిరేసినట్లు, వారిని బయటకు విసిరేశారు. ఇదియే ఆమే చావుకు కారణమయింది.
     rapes, ఈవ్ టీజింగ్ ల లాంటివి జరగకుండా కొంచెం అప్రమత్తంగా ఉండడమంటే ఏమి చేయాలో ఆలోచించవలసిన సమయం వచ్చింది. నా ఉద్దేశ్యంలో ఈ క్రింది జాగ్రత్తలు/ మార్పులు అత్యవసరం:
1. నేటి పోటీ యుగంలో ఆడ పిల్లలు ఒంటరిగా ఏ వేళప్పుడయినా సంచరించడం అనివార్యమౌతున్నందున-బయట తిరగొద్దు, మగాణ్ణి తోడుగా తెసుకెళ్ళాలి లాంటి పనికిరాని సుత్రాలకన్నా తను ఎక్కాలనుకుంటున్న బస్సులో కనీసం ఇంకొంతమంది ఆడవాళ్ళు మరియు చాలామంది పెద్దవాళ్ళు (మగాళ్ళయినా) ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. డిల్లీ ఘటనలో ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సులో ఆవేళ్ళప్పుడు ఈ ఒక్క లాజిక్ ఆలోచించియుంటే వారా బస్సు ఎక్కేవారుకాదేమో?
2. అమ్మాయిలకు నచ్చిన డ్రస్సింగ్/ మేక్ అప్ లాంటివి వద్దని చెప్పలేం కానీ కాస్తంత సాంప్రదాయంగా/ మరీ మోడ్రన్ గా కాకుండా అంటే అవతలివాళ్ళ పాడు దిష్టి నేరుగా మనపైనే పడేలా ఉండకుంటే మంచిది. ఇక్కడ తమ స్వేశ్ఛా స్వాతంత్ర్యాల గురించి కాకుండా ఏదైనా తేడా జరిగితే కోల్పోయే తమ సర్వస్వం గురించి ఆలోచించడం ముఖ్యం కదా.
ఇక అన్నింటికన్నా పెద్దది సామాజిక బాధ్యత:
1.అదేమంటే అమ్మాయిని పెంచినా, అబ్బాయిని పెంచినా సమానం అన్న ఫీలింగ్ మొదటి నుండి ఉండేలా చూడాలి.
2. ఆడపిల్ల అంటే ఒక ప్రత్యేకత గా, మగ పిల్లోడు అంటే అదేదో లోకం నుండి ఊడిపడినట్లుగా కాకుండా ఆడ, మగ తేడా లేని విధంగా వాళ్ళ ఆలోచన కలిగించేలా తల్లి దండ్రుల ప్రవర్తన ఉండాలి.
3. సామాజిక బాద్యత, తల్లిని, చెల్లిని గౌరవంగా చూడటం, భార్యకి సముచిత స్ధానం ఇవ్వటం అనేది చిన్నతనం నుండి ఉగ్గుపాలతో అలవాటు చేయాలి.
4. స్కూల్స్ నుండి ఈ ఆడ, మగ వేరేగా ఉంచే లక్షణం తీసేసయాలి. మనకి అవతల ఏదో ఆకర్షణ ఉంది, వాళ్ళు అందంగా ఉన్న బలహీనులు అన్న ఫీలింగ్ క్రియేట్ కాకుండా ఉండాలి అంటే ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా స్నేహంగా ఉంటారో అలా చిన్నతనం నుండి అలవాటు చేయాలి. మన పక్క మగవాడి మీద, ఆడపిల్ల మీద మన చూపు వేరేగా ఉండదు.
5. చదువులో, ఉద్యోగంలో, ఆలోచనలో స్త్రీకి సమాన ప్రాదాన్యం ఇవ్వటం అన్నది ఇప్పటి నుండి మొదలు పెట్టాలి.
ఇవన్నీ చేస్తే ఒక్క రోజులో మార్పు రాకపోవచ్చు, కానీ క్రమంగా మార్పు వచ్చి తీరుతుంది. ఈవేళ కట్నాలు, కులాలు, మతాలు పక్కన పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరం 20 సంవత్సరాల క్రితం అభ్యుదయ వాదం గల తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నవారే.
       అత్తలని అసహ్యంగా చూసే కోడళ్ళు, కోడళ్ళ పైన ఆధిపత్యం కోసం చూసే అత్తలు వెళ్ళు ఇద్దరు తమ పిల్లలని పెంచే సమయంలో అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అన్న భావజాలం అలవాటు చేస్తారు. అక్కడ మార్పు ప్రారంభం అయ్యి స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకుంటే క్రమంగా మార్పు ఖాయం.
       ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాల మరియు మెరుగైన సామాజమే తమ ధ్యేయమని ఊదరగొడుతూనే మరోపక్క అమ్మయిలపై అడ్డమైన స్టోరీలను వేస్తూ వంకర మాటలతో వ్యాఖ్యానం చేస్తూ టీఆర్పీ లు పెంచుకునేందుకు తాపత్రయపడే ఎలక్ట్రానిక్ మీడియాకు చాలా ఎక్కువ బాధ్యత. ఎక్కడో ఎవరో ఒకరిద్దరు అమ్మాయిలు తేడాగ ఉంటే వారి గురిచి చెప్పడానికి ఉద్దేశ్యించిన స్టోరీ వేస్తూ అమ్మాయిలందరిపై చీప్ అభిప్రాయం కలిగేలా ఉండే వ్యాఖ్యానం చెయ్యడం తరచుగా చూస్తున్నాం.
       కొన్ని న్యూస్ చానళ్ళవారు సిగ్గూ ఎగ్గూ లేకుండా రాత్రి పదకొండు దాటటమే ఆలశ్యం అసహ్యమైన ప్రోగ్రాములు వేస్తూ ఎవడెటుపోయినా మాకేంటి తమ రేటింగ్స్ తమకొస్తే చాలు అనుకునే ధోరణి తక్షణం మారాలి. సృజనాత్మకత, కళారాధన పేరిట పచ్చి బూతును చూపిస్తున్న సినిమా రంగపు పెద్దల్లారా.. తప్పు....ఇకనైనా మారండి. ఆడ పిల్లలను సెక్స్ వస్తువుగా చూపిస్తు, కురచ దుస్తులతో హీరోయిన్ ను చూపితేనే ధియేటర్లో కాసుల వర్షం కురుస్తుందనే మీ లేకి, మురికి, కురుచ బుర్రలను మార్చుకోండి. మీ ఈ దుర్మార్గపు చేతలవల్ల రోడ్డుపై వెళ్ళే ప్రతి అమ్మాయినీ ఆ హీరోయిన్లతో పోల్చుకుని చూస్తున యువతకంట మీ అమ్మాయి రోడ్డుపై నడుస్తూ వెళితే పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకోండి. మీబిడ్దలకంటే బీ.ఎం.డబ్ల్యూ కార్లుండొచ్చు కానీ మా బిడ్డలు ఆర్టీసీ బస్సుల్లోనో, ఆటోల్లోనో వెళ్ళాల్సిందే. మీరు మీకోసమే అని కాకుండా మాకోసం కూడా ఆలోచించండి. మీల చెత్త, మసి నిండిన బుర్రలతో కాకుండా శుభ్రంగా సినిమాలు తీస్తున్న శేఖర్ కమ్ముల లాంటివాళ్ళను మేం ఇంకా ఎక్కువగా ఆదరిస్తున్న విషయాన్ని గమనించి "పచ్చిగా సినిమాలు తీస్తేనే" పైసలు వసూలవుతాయనే బ్రమల్లోంచి బయటకు రండి. అలా రాలేకపోతే ఈ వ్యాపారం వదిలేసి మీవాళ్ళతో ఇంకేదైనా వ్యాపారం చేసుకోండి. అంతే కానీ మా బ్రతుకులతో ఆడుకోకండి.
      కాబట్టి మనం, మన చుట్టూ ఉన్నవారం మారకుండా ఇలాంటివి జరిగినప్పుడూ ఆవేశంలో -
"అత్యాచారం చేసిన వాడిని ఊరి తీయాలి, నరికేయలి, కొట్టి చంపాలి, బహిరంగ ఊరి తీయాలి వంటి డిమాండ్స్ ఎన్ని చేసినా అది రాజ్యాంగం, ప్రజస్వామ్యం ఉన్న చోట సాద్యము కాదు. ఎన్‌కౌంటర్ చేసెయాలు లాంటి డిమాండ్స్ చేయటం వరకు బాగానే ఉన్నా అలా చేసిన వాళ్ళు జీవిత కాలం కోర్ట్ ల చుట్టూ తిరగటం శిక్షలకి గురి కావటం, వాళ్ళ కుటుంబాలు వీదిన పడటం జరుగుతుంది. పైగా అలా చట్టాన్ని డైరెక్ట్ గా పోలీసుల చేతిల్లో పెట్టేసి మనం హాయిగా ఉండగలమనుకోవడం అవివేకమవుతుంది. రేప్పొద్దున అది పడనివాళ్ళపై కక్ష్య సాధించే సాధనంగా మారదన్న గ్యారంటీ ఉండదు. కాబట్టి చట్టం వేగంగా స్పందించింది, నిందితులు అరెస్టు అయ్యారు కాబట్టి ఇప్పుడు న్యాయ వ్యవస్ధ చొరవగా వ్యవహరించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకి స్వయం నిర్ణయం తీసుకుని నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేయమని కోరుకోవాలి. అలా న్యాయ వ్యవస్ధకి మన అభ్యర్ధన, ఉత్తరం రూపంలో పంపుదాం. వేలాది మంది అలా సుప్రీమ్ కోర్ట్ కి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపితే నేరుగా స్పందన తెలుస్తుంది. ఇక్కడ మనం పట్టుకున్న క్యాండిల్ వాళ్ళ హృదయాలలో వెలుగులు నింపుతుంది.

Thursday, September 6, 2012

ఉపాధ్యాయ దినోత్సవ శుభదినాన........ నా (రెండవ సంతానం) పుత్రుడికి స్వాగతం!

బ్లాగర్ మిత్రులందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. స్వర్గీయ సర్వేపల్లి వారి జన్మ దినమైన నేడు.......నాకు రెండవ సంతానంగా పుత్రుడు జన్మించడం .........(సెప్టెంబరు 5, ఉదయం 6.55 ని"లకు) మరియు ఈ వార్తను మీ అందరితో పంచుకోవడం....ఆనంద దాయకం.
అలాగే తెలుగు భాష మీద ఎంతో పట్టున్న  మితృలకు ఒక విజ్ఞ ప్తి ...........     
"వే",  "వై" లేదా "య" అనే అక్షరంతో మొదలయ్యే కొన్ని మంచి పేర్లను సూచించగలరు.....
ధన్యవాదాలు.

Sunday, July 8, 2012

వాళ్ళు దొబ్బి తిన్నదంతా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటే, మళ్ళీ న్యాయ సాయం అంటూ ఎవడబ్బసొమ్మని ప్రజల డబ్బు పంచుతార్రా?


     చాలీ చాలని జీతంతో బ్రతుకీడ్చే ఓ చిరుద్యోగి ఏదో పదికో పరక్కో  కక్కుర్తిపడి దొరికిపోతే వెంటనే సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసి - ఆ సస్పెన్షన్ కాలానికి అర్ధ జీతం మాత్రమే ఇచ్చి కన్న కష్టాలు పెడతారు. కానీ మన ఘనతవహించిన ప్రజాసేవకులకూ, వారి క్రిమినల్ సెక్రెట్రీలకూ మాత్రం జేబుల్లోవి వదలకుండా ప్రజల డబ్బుల్తోనే న్యాయ సహాయమందిస్తారట? ఎంత విచిత్రం?!
    జగన్ ఆస్తుల కేసుకు సంబందించి ఆరుగురు మంత్రులకు నోటీసుల వ్యవహారంలో నలుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డిలకు మాత్రం న్యాయ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆసక్తికరంగా ఉంది. దీని ప్రకారం మంత్రులు పెట్టుకునే లాయర్లకు అయ్యే వ్యయాన్ని ప్రబుత్వం భరిస్తుందన్నమాట. అంటే దీని అర్దం వీరు జారీ చేసిన జీఓలలో తప్పు లేదనుకోవాలా? లేక వ్యక్తిగతంగా వీరు తప్పు చేయాలేదని భావించాలా అన్నది చర్చనీయాంశం అవుతుంది.  ప్రభుత్వపరంగా వీటిపై సమాధానం ఇవ్వకపోగా మొదట్లో  మంత్రులు వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని సూచించడం ఆ తర్వాత వారికి ఇప్పుడు పీజు ఇస్తామనడం ఒకడికొకడు సాయం చేసుకునే దొంగల రాజ్యాన్ని తలపిస్తోంది.
    పోనీ వై.ఎస్ ఒక్కడే తప్పులు చేసాడు, మిగతా మంత్రులందరూ పరిశుద్ధులని ఈ ప్రభుత్వం భావిస్తోందనుకోవాలా అంటే అదీ లేదు. తనకు న్యాయసహాయం చేయాలని కోరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు విన్నపాన్ని పట్టించుకోనేలేదు.మోపిదేవి అరెస్టు అయినప్పుడు , ఆయన తప్పు చేయలేదని, ఆయనకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అద్యక్షుడు బొత్స , చిరంజీవి వంటివారు వ్యాఖ్యానించారు.తీరా ఆయన కోరినా ప్రభుత్వం స్పందించలేదు.
   నలుగురు మంత్రులకు మాత్రమే జిఓ ఇవ్వడం విశేషంగా ఉంది. పొన్నాల వ్రాసిన లేఖ తమకు అందలేదనీ, మరోసారి లేఖ పంపాలని ఆయన్ను కోరామనీ వివరణ ఇవ్వడాన్ని చూస్తే పాలన ఎంత అధమంగా ఉందో తెలుస్తోంది.ఇదే సమయంలో వీరితో పాటు ఎనిమిది మంది ఐ ఎ ఎస్ లకు ఇచ్చిన నోటీసుల విషయంలో వేరుగా జిఓ ఇస్తారా? వారికి సాయం చేయడానికి కూడ ప్రభుత్వం సిద్దపడుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది.ఇదంతా చూస్తుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చేసిన సామెత గుర్తుకు రావడంలేదూ? మరి రేపట్నుండి ఏసీబీ కేసుల్లో ఇరుక్కునే ప్రతి చిన్నా పెద్దా ఉద్యోగులక్కూడా న్యాయ సహాయం చేసెయ్యండి....ఏం చక్కా జంకూ గొంకూ లేకుండా ప్రతొక్కడూ ప్రజల దగ్గర లంచాలు బరుక్కుంటూ (కావాలంటే మీ వాటాలు మీకు పంచుకుంటూ) రాష్ట్రాన్ని లంచాంధ్ర ప్రదేశ్ గా మారుస్తారు.  


Saturday, July 7, 2012

రోడ్డుపై చెత్త వేస్తే పదివేల జరిమానానట! ప్లాస్టిక్ నిషేధం లాగానే మరో చెత్త రూల్?!

     గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే పది వేల రూపాయల జరిమానాను విధించడానికి మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్దమవుతోంది. హైదరాబాద్ నగరంలో జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు జరగనున్న సందర్భంగా నగరాన్ని సుందరీకరించడానికి ప్రభుత్వం నూటపాతిక కోట్లు కేటాయిస్తే కార్పొరేషన్ మరో నూట పాతిక కోట్లు ఖర్చు చేయబోతోందట! ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణబాబు ఈ ప్రకటన చేశారు. 
     కాని ఇది ఆచరణ సాధ్యమేనా అన్నది చర్చనీయాంశం. ఆదర్శం మంచిదే కాని ప్రతిదానికి అంతమొత్తంలో జరిమానా అంటే అది కార్పొరేషన్ సిబ్బంది అవినీతికి ఉపకరిస్తుందా అన్నది చూడాలి.పైగా పది వేల జరిమాన కట్టడానికి ఎంతమందికి ఆర్దిక స్థోమత ఉంటుందన్నది కూడా ఆలోచించాలి. ముందుగా ప్రజలలో అవగాహన పెంచాలి. అలాగే చెత్త వేయడానికి అనువైన ప్రదేశాలను అందుబాటులోకి తేవాలి. చెత్తను సేకరించేందుకు పెట్టుకున్న సిబ్బంది ఎంత ప్రాంప్ట్ గా వాళ్ళ పని చేస్తున్నారో చూసేవాడెవడు? అంతెందుకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టల్ని పంచి తడి, పొడి చెత్తల్ని వేరువేరుగా సేకరించాలనే అతిచిన్న పధకాన్నే అమలు చెయ్యలేని ఈ చేతగాని ప్రభుత్వాలు "జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు" పేరుతో 300ల కోట్లను మంచినీళలా ఖర్చుపెట్టి ఏం సాధిస్తారు? ఓహో, మనదగ్గరున్న డబ్బును ఏదో ఒక పధకం పేరుతో ఖర్చుపెడితేనేగదా ఎవడి కమీషన్లు వాడికొచ్చేది?! 
    అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటే అది నిరర్ధకంగా మారుతుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచుల నిషేదం అమలు చేస్తున్నట్లు అట్టహాసంగా కార్పొరేషన్ ప్రకటించినా, ఆ మేయర్ దిగిపోగానే దాని గురించి పట్టించుకున్న వారు ఉన్నట్లు కనిపించరు. పైగా వినియోగదారుల నుంచి అదనపు సొమ్మును మాత్రం షాపుల వారు వసూలు చేస్తున్నారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ నిర్ణయాలు తీసుకుంటే మంచిదేమో.!
     ఈ చెత్త నా....లకు చిత్త శుద్ధి లేకుండా ఏవేవో చెత్త రూల్స్ తీసుకొస్తే ఏమిటి ఉపయోగం? బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తే ఫైన్ అన్నారు. ఎవణ్ణైనా రోడ్డుమీద/ bus standsలో సిగరెట్ తాగుతుంటే అలా చెయ్యొద్దంటే ఊరుకుంటాడా? పైగ మనల్నే పిచ్చి నా...లాగా చూస్తాడు. తిడతాడు, అవసరమైతే కొడతాడు. అంతెందుకు ఎన్ని ధియేటర్లలో స్మోకింగ్ బాక్సులున్నాయ్?? వాటిని పర్యవేక్షించే చెత్త నా....లెవడు?? 
(Courtesy: Sri. KSR garu, NTv)

Monday, July 2, 2012

జె.డి కాల్ లిస్ట్ వ్యవహారంలో కొత్త మలుపు! గుడ్డిగా సమర్ధిస్తూ వస్తున్న కొందరు సూడో ఇంటలెక్చ్యువల్స్ మరియు ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెళక్కాయ!!

         కాల్ లిస్టు వ్యవహారమై హైకోర్టులో పడిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ను ఈ నెల తొమ్మిదో తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడమేకాక కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెయ్యడంతో గత కొంతకాలంగా జె.డి ను ముందూ వెనకా చూడకుండా గుడ్డిగా సమర్ధిస్తూ వస్తున్న కొందరు సూడో ఇంటలెక్చ్యువల్స్ మరియు ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెళక్కాయ పడ్డట్లయింది. 
       వాస్థవానికి ఇలాంటి కేసుల్లో దూకుడుగా వ్యవహరించడంవల్ల విచారణాధికారులపై సహజంగానే జనాల్లో కాస్త క్రేజ్ ఏర్పడుతుంది. కానీ, అంతమాత్రానికే వాళ్ళు నిష్పక్షపాతులనీ ఇక అవినీతిని ఏకమొత్తంగా అంతమొందిస్తారనీ కలలుగనడం అవివేకమే అవుతుంది. మనలో చాలామంది అలా భావించే ఆయనకు అభిమానులయ్యారు. అది తప్పుకాకపోవచ్చు.
        కానీ, విచారణా తీరు కాస్త దారిమళ్ళినట్లూ, అసహజంగా ఉన్నట్లూ అనుమానాలొచ్చిన తర్వాతకూడా గుడ్డిగా అతన్నే సమర్ధించడం ఏం వివేకమో నాకర్ధం కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తీ చట్టాలకూ, న్యాయ సూత్రాలకూ అతీతుడు కాదు. అలా ప్రవర్తించేవాడెంతటివాడైనా ఏదో ఒకరోజు అదే చట్టం చేతిలో మొట్టికాయలు తిని అధోగతిపాలవ్వవలసిందే.
     వాస్థవానికి, అటువంటి చర్యలను నిందితునితోపాటూ మిగతావారందరూ ఖండించవలసిందే. కానీ, వై.ఎస్సార్.సీపీ వారు జె.డి కాల్ లిస్ట్ బయటపెట్టినప్పుడు అందరూ అనవసర విషయాలవైపు దారిమళ్ళించి(చంద్రబాలా, వ్యక్తిగతమూ తోటకూర కట్టా...అంటూ) అసలు విషయాన్ని మరుగున పడేశారు. వ్యక్తిగతాలు మాట్లాడుకోడానికి ఎటూ రెండు మూడు పర్సనల్ ఫోన్లు ఉండగాకూడా ఆఫీసు ఫోనులోంచి కూడా మాట్లాడారంటేనే విషయాలు ఎంత దూరం వెళ్ళి ఉంటాయో వివేచనాపరులెవరైనా ఊహించగలరు. కానీ, మన పోకిరి, దూకుడు ఆఫీసర్ యొక్క సమర్ధకులకు దెబ్బతిన్న ఆయన ప్రైవసీ మీద ఉన్నంత ధ్యాస ఆయన ఫాలో అవ్వవలసిన మన్యువల్ మీదా, రూల్స్ మీదా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇదెలా ఉందంటే మనకు గిట్టనివాణ్ణి మరొకడు ఏదోలా దెబ్బతీస్తున్నాడంటే అంతే చాలు అని రాక్షసానందాన్ని పొందుతున్నట్లుగా.
      ఇక్కడ జగన్ చేసిన తప్పులేమీ లేవా, ఉంటే వాటికి శిక్ష పడకూడదా అనే విషయాలను కాసేపు పక్కన పెడితే అందుకు మనం అవలంభించాల్సిన పద్ధతులు సరిగా ఉండనవసరం లేదా అన్నదే ప్రాధాన్యాంశం. మనకు నచ్చనంతమాత్రాన ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అంతమొందించుదామనో, వ్యక్తిత్వ హననం(డీఫేం చెయ్యడం ద్వారా) చేద్దాం అనుకోవడం రాక్షసత్వం కాక మరేమిటి?? ఈ కోణాన్ని బయటపెట్టేందుకు కాల్ లిస్ట్ బయటపెట్టడం ద్వారా వై.ఎస్సార్.సీపీ నాయకులు చేసిన ప్రయత్నం ఖచ్చితంగా హర్షణీయమే.
        అయితే యాజమాన్యాల ఆదేశాలకనుగుణంగా, వారితో కుమ్మక్కైన ముఠాలతో అంటకాగక తప్పని దుర్భర పరిస్థితుల్లో పనిచేసే క్రైం రిపోర్టర్ల, మరొక స్త్రీ కి సంబంధించిన ప్రైవసీకి భంగం కలిగించే రీతిలో కాకుండా జాగ్రత్తపడియుంటే బాగుండేది. వాళ్ళ పర్సనల్ నంబర్లను పూర్తిగా కాకుండా మధ్యలో కొన్ని అంకెలను XXXXXలుగా చూపి ప్రచురించాల్సింది. పాపం ఆ స్త్రీ కూడా రాజకీయ జూదంలో పావుగా మారియుండవచ్చు.         
          ఎందుకంటే మన దేశంలో ఓ నాయకుణ్ణి/ అధికారినీ/ జడ్జీలనూ ప్రభావితం చెయ్యడానికీ వారి బంధు/మిత్ర/కుటుంబ సభ్యులను ప్రయోగించడం కొత్త విషయమేం కాదు. ఓ నీరా రాడియా, మాజీ జడ్జ్ చలపతి రావు చివరకు ఓ తారా చౌదరి ఇలా ఎంతోమంది రాజకీయ పావులుగా వాడుకోబడ్డది నిజమే అయినప్పుడు మరో స్త్రీ ద్వారా జె.డి ని ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యడానికి ఆమె పనిచేసే సంస్థతో లింక్ ఉన్న కొందరు పెదలు ప్రయత్నించి ఉండరని మనం ముందే తేల్చేసి ఆమె పైనా, ఆమె పనిచేసే స్వచ్ఛంద సంస్థపైనా ఈగనుకూడా వాలనివ్వనివిధంగా కంచె వెయ్యాలనుకోవడం ఎలా భావ్యం? అన్నా హజారేలాంటివాడే తన ఆధ్వర్యంలో నడిచే సంస్థ నిధులతో తన బర్త్ డే ను అట్టహాసంగా నిర్వహిస్తుంటే వద్దని చెప్పకపోవడంవల్ల విమర్శలపాలయ్యాడు!
        కనుక ఏదైనా కొత్త విషయం వెలుగులోకి వచ్చినప్పుడు జరగాల్సిన దాన్ని పక్కన పడేసి పిడకల వేట సాగించేవారందరికీ ఇదో గుణపాఠం కావాలని నా ఆశ. నిజం నిలకడమీద తెలుస్తుందన్నట్లు జె.డి సచ్ఛీలత, సంఘ సేవికల నిస్వార్ధ  సేవా గుణం వంటివన్నీ బయటకొస్తే మంచిదే కదా??

Friday, June 22, 2012

పాపం చంద్రబాల! సిబిఐ జెడి కి ఇంటర్ లో క్లాస్ మేట్ అవడమే పాపమా?


         జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తనకు ఇంటర్ లో క్లాస్ మేట్ అని, తాను లీడ్ ఇండియా ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతుంటామని సిబిఐ జెడి కాల్స్ జాబితాలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన వాసిరెడ్డి చంద్రబాల చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పూర్వ విద్యార్ధుల సంఘం కార్యకలాపాల నిమిత్తం అప్పుడప్పుడు లక్ష్మీనారాయణతో మాట్లాడేదానినని , అంతకు మించి వేరే విషయాలేమీ తెలియదని అన్నారు. తాను ఐబిఎమ్ లో పనిచేస్తుంటానని, యుకెలో ఉండి, రెండువేల తొమ్మిది నుంచి ఇక్కడ ఉంటున్నానని అన్నారు. తన భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని ఆమె తెలిపారు. సాక్షి లోవచ్చిన కదనాలు తనకు బాధ కలిగించాయని, అయితే ఇది ఒక అనుభవంగా తీసుకుంటానని ఆమె చెప్పారు.
       తనకు ఈ వివాదం మొదలైనప్పటి నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని చంద్రబాల తెలిపారు. తానేదో మంచిపని చేయడానికి వస్తే ఇలాంటివి రావడం బాధ కలిగించిందని అన్నారు.తనకు రాజకీయాలు తెలియవని, పత్రికలు కూడా పెద్దగా చదవనని అన్నారు. తాను ఆంధ్రజ్యోతి ఎమ్.డి.కి లీడ్ ఇండియా వార్తల కవరేజీ నిమిత్తం ఫోన్ చేశానని అన్నారు.తాను ఫోన్ చేసిన వివరాలు ఎలా బయటపడ్డాయో తెలియదని అన్నారు. కేసు పెడతారా అని అడిగితే కేసు పెట్టాలని ఉందని అన్నారు. తన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లయ్యాయని ఆమె చెప్పారు.ఎప్పుడైనా మంచి కార్యక్రమాలు చేయదలిస్తే ఫోన్ చేస్తుంటారని, తనతోనే కాదని, చాలామంది పూర్వ విద్యార్దులతో కూడా మాట్లాడుతుంటారని అన్నారు.తనకు సమయం ఉంటుంది కనుక సేవా కార్యకలాపాలు నిర్వహిస్తుంటానని, వాటికి ఆయన కూడా సహకరిస్తుంటారని ఆమె తెలిపారు.
      అయితే అంతమాత్రాన నిజంగా ఆమెకు ఈ కేసుతో ఏ సoబoధమూ లేదనుకోవాలా? అంటే సమాధానం చెప్పాల్సింది జెడి మాత్రమే. ఇహపోతే ఆమె క్లాస్‌మేట్ అయినంతమాత్రాన, ఏవో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నంతమాత్రాన, వాటికి జేడి కూడా ప్రోత్సాహమిస్తున్నట్లయినాగానీ అన్నేసి సార్లు అర్ధరాత్రీ అపరాత్రీ మట్లాడేంత (అదీ ఇంతటి ముఖ్యమైన కేసును విచారిస్తున్న సమయంలో!) తీరిక ఆయనకెలా ఉంటుంది అనేది విమర్శకుల ప్రశ్న. పైగా ఆమె ఆంధ్ర జ్యోతి వేమూరి తో కూడా అదే సామాజిక కార్యక్రమాల గురించి మాట్లాడాననండం, ఆయన చానెల్లోనే వచ్చిన ఆమె వివరణ సందర్భంగా కూడా రాధాకృష్ణ కవర్ చేసిన తీరు (ప్రశ్నా తనే వేసి జవాబూ ఆయనే చెప్పిన విధం!) చూస్తే కొన్ని అనుమానాలైతే కలిగే వీలుంది.
      అంతమాత్రాన వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయబూనకూడదనేది మాత్రం వాస్థవం. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడానికి వాళ్ళ చిన్ననాటి మితృలనో బంధువులనో వాడుకోవడం మన దగ్గర తరచుగా జరుగుతున్నవే. గతంలో నీరా రాడియా వ్యవహారంలోనూ చూసాం. రతన్ టాటా లాంటి దిగ్గజాలతోనే మంతనాలు జరిపిన తీరూ, ఆ సంభాషణ బయటపడితే తన పరువెక్కడపోతుందోనని రతన టాటా గాబరా పడిన తీరూ చూస్తే ఏదైనా సాధ్యమేననిపిస్తోంది.
       ఏది ఏమైనా నిజా నిజాలు బయటపడాలంటేమాత్రం సిబిఐ జెడి నోరు విప్పాలి, లేదా న్యాయ విచారణలాంటిది జరగాలి. ఒకరకంగా చూస్తే చంద్రబాల గురించికూడా అనవసరం. జేడీ అంత తీరిక చేసుకుని మరీ మీడియాకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నదే ప్రధాన ప్రశ్న.

గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్న క్రైం రిపోర్టర్లు?!


        క్రైం రిపొర్టర్లకు మిగతా విలేకర్లకన్నా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందట - అదేంటంటే తాము మిగతావారికంటే అడ్వాన్స్‌డ్ గా ఆలోచించగలమనీ, క్రైములు చేసేవారినే తలదన్నేలా తాము ఆలోచించగలమనీనూ!!
బహుశా ఆ తెలివితోనేనేమో జేడీ ఫోన్‌కాల్స్ వ్యవహారంలో వై.ఎస్సార్.సీపీ చేసిన ఆరోపణలను ఖండించే పనిలో అతి తెలివితేటలు ప్రదర్శించారు!
1. తమ విధి నిర్వహణలో భాగంగా ఎవరికైనా ఎన్నిసార్లైనా ఫోన్లు చేస్తాం. అలాగే ఝేడీ కీ చేసాం తప్పేంటి?
అయ్యా! మీరు ఆయనకు చేసింది తప్పని మేమనడం లేదు. కానీ, మీరడిగేవాటికి జవాబు చెప్పడం వరకు చెయ్యడమే కష్టంగా ఉండాల్సిన అధికారి (వాస్థవానికి అలా రెస్పాండ్ అవ్వడం కూడా తప్పనేది వేరే విషయం) పనిగట్టుకుని మరీ తనే మీకు ఫోన్ చేసి వివరాలందించడం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్న!!
2. మా ఫోన్ నంబర్లను మీరు బహిరంగంగపర్చడంవల్ల మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్!
అయ్యా! మీరు చెప్పేది నిజ్జంగా ఇజం అనుకున్నా - అలా బెదిరింపు కాల్స్ చేసేవాళ్ళ సత్తా ఎంత. అవి వుట్టుట్టి బెదిరింపులే అండానికి నా వివరణ. మీరు చెబుతున్నట్టుగా జగన్ సానుభూతిపరుల/పార్టీవారినుండి మీకు ప్రాణహాని జరిగేదుంటే ఇపాటికి మీలో ఒక్కడూ మిగిలుండేవాడు కాదు. అలా చెయ్యాలనుకునేవాళ్ళకు ఇప్పుడెవరో మీ నంబర్లిస్తే తప్ప చెయ్యలేనంత చేతగాకుండా ఉండరు. ఏ ఏ చానళ్ళు, ఏ ఏ రిపొర్టర్లు జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు (మీ భాషలో నిజాలు తవ్వుతున్నారు), వాళ్ళ కదలికలు/ వివరాలు తెలుసుకోలేనంత వెనకబడి వాళ్ళుండరు. అదే నిజమైతే అలాంటివాళ్ళ వల్ల మీకే నష్టమూ లేదు. సో, మీరు గుమ్మడికాయల దొంగ సామెతను నిజం చేస్తున్నట్లే కాదా?!
     మీడియాలో ఉన్న పోటీని, వైరాన్ని అడ్డుపెట్టుకుని, అందులో కొందరిని తన పథకంలో భాగస్వాములుగా మార్చుకోవడమో, లేక వారి పథకంలో తాను భాగం కావడం వరకు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వెళ్లిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గత మార్చి నుంచి జూన్ 17వరకు ఫోన్ కాల్స్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
     సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నంబర్ 9441433444 నుంచి వివిధ మీడియా ప్రతినిధులకు, వాసిరెడ్డి చంద్రబాలకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు
ఫోన్ నంబర్ పేరు కాల్స్ సంఖ్య
96XXXXXXX4 వాసిరెడ్డి చంద్రబాల 328
99XXXXXXX5 నాగమారుతి శర్మ 5
99XXXXXXX8 ఆంధ్రజ్యోతి పవన్ 5
99XXXXXXX8 టీవీ 9 మురళీధర్ 5
90XXXXXXX8 ఎన్టీవీ అరవింద్‌శర్మ 18
94XXXXXXX9 ఆంధ్రజ్యోతి ఎబిఎన్ వెంకట్ 54
80XXXXXXX3 ఈనాడు విశ్వప్రసాద్ 11
80XXXXXXX3 ఈనాడు వీరభద్రం 56
97XXXXXXX0 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సత్యనారాయణ 94
98XXXXXXX4 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విక్రమశర్మ 107
98XXXXXXX5 టైమ్ ఆఫ్ ఇండియా బి కృష్ణప్రసాద్ 123
94XXXXXXX8 రమేష్ వైట్ల 142
99XXXXXXX7 టీవీ-9 మహాత్మా 381
వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ మొబైల్ ఫోన్ 96XXXXXXX4 నుంచి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు.
9441433444 వివి లక్ష్మీనారాయణ 411
9441113444 వివి లక్ష్మీనారాయణ 21
9985411111 రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి) 10
8886200013 డెల్లాయిట్, హైదరాబాద్ 10
9849016366 జెవి రాముడు, ఐపిఎస్ 15

Thursday, June 21, 2012

జెడి ఫోన్ కాల్స్ వ్యవహారం సిబిఐ వర్సెస్ వై.ఎస్సార్.సీపీ మధ్య ప్రత్యక్ష యుద్ధం కానుందా? చంద్రబాల మరో నీరా రాడియానా??

       అవినీతిపై పోరు అంటూ దేశంలోకెల్లా అత్యంత అవినీతిమంతమైన పార్టీ మొదలెట్టిన తిరకాసు పోరు రోజు రోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. వీళ్ళ సీట్ల కోట్లాటల పుణ్యమా అని ఇప్పుడు ఇన్నేసి వింతలు జరిగి జనాలకు నిజాలు తెలుస్తున్నాయి. లేకుంటే మొన్న మొన్నటివరకూ నీతి చంద్రికలను ఏ కోర్టుల్లో ఘంటాపదంగా వినిపించారో అదే కోర్టు బోనులో నిలబడ్డ పట్టాభిలాంటివాళ్ళూ, పెద్దాయన ఉప్పు తిన్నందుకు ఆయన పెట్టమన్న చోటెల్లా (ఫ్రీగా) సంతకాలు పెట్టినందుకే మేమూ జైలుకెళ్ళాలా అని ముక్కులు చీదుకున్న ఐ.ఏ(అయ్యా)ఎస్ ల, మంత్రుల అసలు అవతారాలూ బయటకి వచ్చేవి కావేమో?
      మార్చి నెల నుంచి జూన్ పదిహేడో తేదీవరకు సీబీఐ జీడీ లక్ష్మీనారాయణ పోన్ కాల్స్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విడుదల చేసింది. జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ శాసనసభ పక్షం విడుదల చేస్తూ, సిబిఐ కుట్ర ప్రకారమే వై.ఎస్.జగన్ కేసును డీల్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది.
        మీడియా ప్రతినిదులతో పాటు వాసిరెడ్డి చంద్రబాల అనే ఆమె కు లక్ష్మీనారాయణ సెల్ ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్, అలాగే మీడియా నుంచి, చంద్రబాల నుంచి లక్ష్మీనారాయణకు వెళ్లిన ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేసి ఇందులో కుట్ర ఉందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
         ఒక వర్గం మీడియాతోనే మాట్లాడారన్నది ఒక అభియోగం కాగా, చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎమ్.డి.రాధాకృష్ణకు కూడా పది ఫోన్ కాల్స్ చేసినట్లు ఆ జాబితా వెల్లడించింది. ఒక టీవీ ప్రతినిధితో 389సార్లు జెడి మాట్లాడినట్లు జాబితా వెల్లడించడం విశేషం. ఒక వర్గం మీడియావారితోనే జెడి మాట్లాడారన్నది ఎమ్మెల్యేల అభియోగంగా ఉంది. అయితే చంద్రబాల గురించి కూడా అందరిలో ఆసక్తి ఏర్పడింది.
        చంద్రబాల తో 320సార్లు జెడి మాట్లాడారన్నది వీరి అభియోగం. ఎవరీ చంద్రబాల అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో ధర్నా చేసిన సందర్భంగా ప్లకార్డులను కూడా ప్రదర్శించడం విశేషం.
        మీడియా ప్రతినిదులతో జెడి మాట్లాడడం లో పెద్ద తప్పు ఉంటుందా అన్నది చర్చనీయాంశం. అయితే కేవలం కొందరితోనే ఆయన మాట్లాడారన్నది ఒక విమర్శ కావచ్చు. జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియాతోనే ఆయన మాట్లాడారని, సిబిఐ ఆయా వ్యక్తులను విచారించే సందర్భంలో పలు విషయాలు బయటకు వచ్చిన తీరుపై సాక్షి ఫిర్యాదులు చేసిందని, అయినా పట్టించుకోలేదన్నది మరో అభియోగంగా ఉంది.
          కాగా మీడియాతో మాట్లాడినదానిపై ఎంతవరకు ఇది సమస్య అవుతుందో చెప్పజాలం. విచారణాధికారులుగా ఉన్నవారు నేరుగా మీడియాతో మాట్లాడకూడదనే నైతిక సూత్రాన్ని పాటించకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పుబట్టవలసిందే. సిబిఐ మాన్యువల్ ప్రకారం సిబిఐ లో అదికార ప్రతినిధి తప్ప మరెవరూ మీడియాతో మాట్లాడరాదు అనేది వై.ఎస్సర్.సీపీ వాళ్ళ ఉవాచ.
          ఇంకా వాసిరెడ్డి చంద్రబాల పాత్రపై ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే అప్పుడు సిబిఐ పాత్రపై మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వద్ద ఇంకే ఆరోపణల జాబితా ఉంది? వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆ పార్టీ చూపబోతోందన్నదానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంటుంది.ఇక ఇప్పుడు ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు మధ్య యుద్దంగా మారిందని అనుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరం.
        మరో ఆసక్తికర అంశం ఏమంటే బుడిబుడి అడుగులప్పుడే తన కొడుకు ఏదో నాలుగు అడుగులు గట్టిగా వేసాడుగదాని చూడు మావాడు త్వరలో తప్పకుండా రన్నింగ్ లో ఒలెంపిక్ మెడల్ తెస్తాడు అని సంతోషించడం ఎలా మూర్ఖత్వమౌతుందో మన దేశంలో ఉన్న (కొందరు) అధికారుల్నీ, నాయకుల్నీ చూసి మురిసిపోతే అలాగే అవుతుందని ఈ సంఘటన నిరూపించడంలేదూ?!  సీబీఐ పక్కా కేంద్రం చెప్పినట్లే ఆడుతుందని మొన్నామధ్య మాజీ డైరెక్టర్ చెప్పడం, జగన్ విచారణ సమయంలో టీవీ9, ఏబీ్ఎన్ చానళ్ళు లోపల జరిగింది ప్రత్యక్షంగా చూసినట్టే వెంటవెంటనే ప్రసారం చెయ్యడం లాంటివి ఒక్కసారి పరికిస్తే లక్ష్మీనారాయణ లాంటి అధికారుల్ని చూసి పోకిరి, అంకుశం రాజశేఖర్ లతో పోల్చి మురిసిపోవడం (including me) తప్పనిపించడం లేదూ?!

Sunday, June 17, 2012

నాన్నకు ఫాదర్స్ డే రోజే కృతఙతలు చెప్పాలా?

(NOTE: ఫాదర్స్ డే అంట...నీకు శుభాకాంక్షలు చెప్పాలా? అంటూ సాయి చుండూరి(జెమినీ సాయి అనికూడా పిలుస్తాం) గారు తన ఫేస్ బుక్ లో వ్రాసిన ఈ కవ్త హార్ట్ టచింగ్ గా అనిపించి యదాతధంగా ఇక్కడ ఇస్తున్నాను. థ్యాంక్స్ టు సాయిగారు) 
--------------------------------------------------------------------------------------------------------
ఈరోజు ఫాదర్స్ డే అంట...
నీకు శుభాకాంక్షలు చెప్పాలా?

పరాయోళ్ళ జీవితాల తాలూకు
... ప్రత్యేక దినాలకి....
పనికట్టుకుని మరీ శుభాకాంక్షలు చెప్పినట్టు
రక్తం పంచిన నీకూ శుభాకాంక్షలు చెప్పాలా?

బ్రతుకునిచ్చావు....
మమ్మల్ని మాలాగే బ్రతకనిచ్చావు....
జీవితంలో ప్రతి కీలక మలుపులోనూ
నువ్వన్నావు.....
నువ్వేసిన దారేగా....?
మరి ఎందుకా పహారా?

నీ రక్షణ కంచె దాటి
ఏ ముప్పు మమ్మల్ని ముంచుతుందని
నీ భయం?నీ పిచ్చికాకపోతే.....!!

అమ్మ నీ కంచంలో అన్నం
వడ్డించిన ప్రతిసారీ....
"పిల్లలు తిన్నారా?" అని....
ఆరాలు తీస్తావు.....
నీకోసం నువ్వాలొచించుకున్న
క్షణాలెన్ని నిజం చెప్పు??

ధైర్యానివయ్యావ్....
మేము భయపడ్డప్పుడు
మా భుజాల చుట్టూ చేతులేసి...
వైద్యుడివయ్యావ్....
నిరాశల రోగం వచ్చినప్పుడు
ఆశల పసరు నూరిపోసి....
బోయీవయ్యావ్...
నీ గుండె పల్లకిలో
మము నిత్యం మోసి.....

నీ బ్రతుకంతా మేమేనా?
నీకు నువ్వు మిగిలిన
సందర్భాలు మచ్చుకైనా
ఉన్నాయా అని అనుమానం నాకు?

తమ జీవిత పుస్తకాల్లోని
దాదాపు ప్రతి పేజీని
"బిడ్డలు" అనేఅక్షరాలతో మాత్రమే
నింపుకునే తండ్రులందరూ స్వార్ధపరులే...!!
నువ్వూ అలాంటివాడివేగా....?

ఇక చాలు నాన్నా....
నీ ప్రేమని ఇంకా తట్టుకునే సమర్ధత
నా గుండె కోల్పోయింది.....
రేపటి రోజున మా పిల్లల్ని
నీ అంత పిచ్చిగా ఎక్కడ నేను
ప్రేమించలేకపోతానో అనే ఒక
అభద్రతాభావం నాలో
అనుక్షణం నింపేస్తున్నావు...
ఇది నీకు న్యాయమేనా??

ఇన్నేళ్ళయినా
మాకోసమే నీ గుండె కొట్టుకుంటుంది ఏంటి?
ఇకనైనా నీకోసం దాన్ని కొట్టుకోనీ....ప్లీజ్...!!

Thursday, June 14, 2012

తెలంగాణా విద్యార్ధులూ, ప్రజలూ మీరు ఉద్యమాల పేరుతో ఆంధ్రా స్టార్ల సినిమాలూ, షూటింగులూ అడ్డుకోండి, నాయకులం మాత్రం వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళకు పోయి మెక్కి వస్తాం!


      కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలు మాత్రం కొట్టుకు చావాలి. నాయకులు మాత్రం ఎవడెవడు ఎక్కడ కలుసుకున్నా కౌగిలించుకుంటారు, విందులు వినోదాలూ కలిసి చేసుకుంటారు, కుమ్మక్కై కాంట్రాక్టులు పంచుకుంటారు. ఇదీ ప్రస్తుత లోకోక్తి.
     ఇప్పుడే టీవీ చానళ్ళలో మో(రో)తమోగిపోతున్న ఓ (ఆంధ్రా)హీరో గారి పెళ్ళికి పోయి ముసిముసి నవ్వులతో అందర్నీ కౌగిలించుకుంటున్న మధు యాష్కీ గౌడ్, కేసీఆర్ లనే తెలంగాణా పోరాట యోధుల్ని చూడగానే ఈ టపా రాయాలనిపించింది. సదరు నేతలు తెలంగాణా గొడవలు జరుగుతున్న టైం లో జనాల్ని ఎంతలా రెచ్చగొట్టిందీ, ఆంధ్రోళ్ళ సినిమాలనూ, షూటింగులనూ అడ్డుకునేలా ప్రేరేపించిందీ అందరం మర్చిపోయామనుకున్నారో లేక ఏదో అవసరార్ధం శ్రీరంగ నీతులు చెబుతాం గానీ మనదాకా వస్తే పాటిస్తామా ఏం అనుకున్నారోగానీ వివాహ వేడుకల్లో వాలిపోయారు.
         మామూలుగా అయితే శుభకార్యానికి వెళ్ళడాన్ని ఎవరమూ తప్పుబట్టనవసరం లేదు గానీ, సదరు మనుషులు అప్పట్లో చేసిన ఇలాంటి పనులవల్ల షూటింగులను అడ్డుకొనేందుకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళ గోస సంగతేంటి? అప్పుడు ఇలాంటి తేడాగాళ్ళ మాటలునమ్మి ముందుకురికినోళ్ళకేమో లాఠీ దెబ్బలు, ఇప్పుడు వీరికేమో షడ్రసోపితమైన ఆంధ్రా విందు భోజనాలన్నమాట?
        అచ్చంగా ఇలాంటిదే టీ న్యూస్ చానల్ వారి బాగోతం - ఆంధ్రావాళ్ళకు వ్యతిరేకంగా పుట్టిన కేసీఆర్ మానసపుత్రిక టీ న్యూస్ లో ఆంధ్రావాళ్ళకు అనుకూలమైన ప్రసారాలు ఎందుకు చేస్తున్నట్టు? మొన్న రచ్చబండకు వస్తే రోకలిబండలతో కొట్టండి అంటూ ఊదరగొట్టిన ఆ చానల్ అదే టైములో రచ్చబండలో పాల్గొనండి, మీ సమస్యలను పరిష్కరింపజేసుకోండి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను పదే పదే ఎందుకు ప్రచారం చేసినట్లు? ఓ పక్క సీమాంధ్రవారి చేష్టలకు వ్యతిరేకంగా బంద్ చేస్తుంటే, వాళ్ళ సినిమాలను బహిష్కరించాలని చెబుతూనే ఆ చానల్ మరోపక్క దడ సినిమా యాడ్ ను గంటకు పదేసిసార్లు ఎందుకు వేసినట్లు? అంటే వాళ్ళ ప్రయోజనాలు (ప్రభుత్వ, ప్రైవేటు యాడ్స్ ఆదాయం) వదులుకోవడానికి సిద్ధంగాలేరు, కానీ జనాలు మాత్రం ఇలంటి వెధవల రెచ్చగొట్టే ప్రకటనలకు రెచ్చిపోయి అవతలవాళ్ళమీద దాడి చెయ్యడమో, తమను తాము తగలబెట్టుకోవడమో చేస్తుంటాం. కనుక తెలుగు/ తెలంగాణా తమ్ముళ్ళూ - మనం ఇంత అమాయకంగా ఉన్నంత కాలం ఈ భడవలు మనతో ఇలా ఆడుకుంటూనే ఉంటారు. జాగ్రత్త.

Sunday, June 10, 2012

ప్రభుత్వ భవనం వద్దన్న సచిన్ గ్రేటెస్ట్ కాకపోయినా గ్రేటే! నిజమైన నాయకుడి లక్షణాలిలా వుంటాయ్...


      ఇటీవలే గౌరవ నామినేషన్ కోటాలో ఎంపీ(రాజ్యసభ) పదవి పొందిన సచిన్ కు ప్రభుత్వం ఢిల్లీలో 7000 గజాల 5 బెడ్రూముల విశాల భవనం కేటాయించగా అది తనకక్ఖరలేదని సున్నితంగా తిరస్కరించడం గొప్ప విషయమే. తాను పార్లమెంటు సమావేశాల సమయంలో తప్ప ఢిల్లీలో వుండబోననీ.. ప్రజాధనాన్ని వృధా చేయటం తనకిష్టంలేదని దీన్ని సచిన్ తిరస్కరించాడు.
      వారెవా సచిన్... క్రికెట్లో చాలావరకూ జెంటిల్మన్ గేం ఆడిన నువ్వు రాజకీయాల్లో కూడా అదే ఒరవడి కొనసాగించగలిగితే నువ్వు గ్రేటెస్ట్ అవుతావ్. ప్రస్తుతానికైతే గ్రేటే...ఎందుకంటే ఎన్ని కోట్లున్నా, కొంపలున్నా ఫ్రీగా వస్తే ఫినాయిల్ ను కూడా వదలని నేతలున్న నేటిరోజుల్లో నువ్వు కాస్త డిఫ్ఫెరెంట్! దీనివరకైతే నీకు హాట్సాఫ్.
 అయితే ఇప్పటికిప్పుడు గ్రేటెస్ట్ అని ఎందుకనట్లేదంటే "మొన్న ఎవరో నిబంధనలు ఉల్లంగించినందుకు మీ ఇంటి మీద ముంబై కార్పోరేషన్ కి చెల్లించిన అపరాధ రుసుము ఎంత" అని సమాచార హక్కు చట్టం కింద అడిగితే, థర్డ్ పార్టీ సమాచారం అని కార్పోరేషన్ "సమాచారం ఇవ్వొచ్చంటారా?" అని వాళ్ళు సచిన్ అభిప్రాయం అడిగారు. అయన మాత్రం ఆ సమాచారం ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.
       ఇదిమాత్రం నిజమైన నాయకుని లక్షణం కాదు. తప్పులు అందరూ చేస్తారు. కానీ, తెలిసో తెలియకో తప్పు జరిగినా ఒప్పుకుని సరిదిద్దుకోగలవాడే మంచి నాయకుడు. అందుకే "అందరి కంటే నేను వేరు" అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఆయన చెయ్యల్సింది చాల ఉంది. పైగా "ఇంకా తనకి ఇప్పటికి క్రికెటే ముఖ్యం అని, పార్లమెంట్ రెండవ ప్రాధాన్యం అని సెలవిచ్చారురు. మరి రెండవ ప్రాధాన్యం ఐనప్పుడు సభకు, సభ్యత్వానికి న్యాయం చేయలేనప్పుడు అసలు సభ్యత్వం అంగీకరించడం ఎందుకు?"లాంటి విమర్శలు ఉండనే ఉన్నాయి:) అవన్నీ అధిగమించి తన విలువైన టైం లో మరికొంత రాజకీయానికి కేటాయించి తానే సెలవిచ్చిన విధంగా క్రికెట్ లాగే మిగతా క్రీడలూ అభివృద్ధి ఆయ్యేలా చెయ్యగలిగితే అప్పుడు నిజంగానే గ్రేటెస్ట్ అవుతాడు. క్రీడ అంటే క్రికెట్ మాత్రమే అనేంత దరిద్రంగా తయారైన మన క్రీడా లోకానికి మరోలా దిశానిర్దేశ్యం చెయ్యగలిగితే మిగతా గబ్బు రాజకీయ వ్యవహారాలేవీ పట్టించుకోకున్నా సచిన్ థ గ్రేటెస్త్ లీడర్ అని మనందరం అనొచ్చు:) కాదంటారా?  

Saturday, June 9, 2012

క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ముసుగులో కళంకిత మంత్రులు తప్పించుకోగలరా? ఒకవేళ వై.ఎస్ బ్రతికుండి కాంగ్రేసుని ఎదిరించియుంటేకూడా ఇలాగే జరిగుండేదా??


    "వైఎస్ జమానాలో తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ క్యాబినెట్ మొత్తంగా తీసుకుందని తామొక్కరే ఎలా బాధ్యులవుతామ"ని నిన్న మొన్నటిదాకా తెగ ఊదరగొట్టిన మంత్రులూ, బొత్స, కిరణ్ లకు "    ప్రభుత్వం తీసుకునే కీలక ఒప్పందాలకు సంబంధిత శాఖ మంత్రిదే పూర్తి బాధ్యత" అని సీబీఐ న్యాయస్థానం వ్యాఖ్యానించడంతో  గొంతులో పచ్చి వెళక్కాయ పడినట్లయిందిప్పుడు.      
 పోయినోడెలాగూ సాక్ష్యం చెపడూ, గుడ్లురిమి గదమాయించడూ గదా అనే ధైర్యంతో మనోళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ(క్యాబినెట్ ఉమ్మడి బాద్యత)మంత్రం జపిస్తున్నారుగానీ ఆ సూత్రానికసలు అంత సీన్ ఉందా?
  ఒక్కసారి ఆ సూత్రంయొక్క పుట్టుపూర్వోత్తరాలను పరిశీలిస్తే "ఒక్క ప్రభుత్వంలో భాగస్వాములై ఉండీ, తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం ఏదైనా విషయాన్ని వ్యతిరేకించకుండా అలాంటిదానిపై అభ్యంతరాలను మిగతా మొత్తం క్యాబినెట్ తో చర్చించి తదనుగుణమైన మార్పులు చేయించగలగడమో, అలాకాని పక్షంలో తానా క్యాబినెట్ నుండి వైదొలగడమో చెయ్యాలిగానీ  అందులోనే ఉంటూ సదరు నిర్ణయాన్నిమాత్రం వ్యతిరేకించరాదన్న నైతిక సిద్ధాంతం నుండి ఉద్భవించిన భావన" అది. బ్రిటీషువారినుండి అరువుతెచ్చుకున వెస్ట్ మినిష్టర్ తరహా పాలనా తాలూకు సాంప్రదాయం. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే నీతిసుత్రాలూ, సాంప్రదాయలూ ఎన్నెన్ని ఎక్కడెక్కడనుండి అరువుతెచ్చుకున్నామన్నదానికన్నా వాటిని ఎంతవరకూ నిబద్ధతతో పాటించే ఎదుగుదల మన (రాజకీయ) సమాజంలో ఉంది అన్నది ముఖ్యం. ఎందుకంటే, మనం ఏవైతే పేజీలకొద్దీ ఏర్చి కూర్చి రాజ్యాంగంలో రాసుకున్నామో అందులో చాలావరకూ బ్రిటీషువారి అలిఖిత రాజ్యాంగంలో ఉన్నవే. అంటే వాళ్ళు ఏ శాసనంలోనో చెక్కనవసరం లేకుండానే సాంప్రదాయంలా తరాలకొద్దీ పాటిస్తూ వస్తున్నారు.
  కానీ, మనదగ్గర ఎందరో మహానుభావులు - ఓ శంకర్రావూ, డీ ఎల్ లూ, మమత/జయ/కరుణలూ - క్యాబినెట్ మాత్రం కావాలి, దాని నిర్ణయాలనుమాత్రం వ్యతిరేకించాలి. నాన్నతో పొసగదు, కానీ ఆయన ఆస్థినిమాత్రం అనుభవించాలనుకుంటాం. నిజానికి తండ్రిమాటకు విలువ ఇవ్వలేమనుకున్నప్పుడు, లేదా అయన్ చెప్పింది మనకు రుచించనప్పుడు ఆ ఇంటిలోంచి కట్టుబట్టలతో బయటికొచ్చి మన కాళ్ళపై మనం నిలబడాలి. కానీ, అదే ఇంట్లో ఉంటూ ఆస్థిని అనుభవిస్తాం కానీ ఆయన మాట వినం అనడం రెండో రకం.
 ఇక మేళ్ళ వ్యవహారంలో కలక్టివ్ రెస్పాన్సిబిలిటీ విషయానికొస్తే - "పెద్దాయన హుకుం జారీ చేసాడు, మేం చెయ్యక తప్పలేదు. అదీకూడా క్యాబినెట్ మొత్తం కలిసి కూర్చొని నిర్ణయించిన ప్రకారమే నేను చేసాను, పైగా అందుకు ప్రయోజనం(మేత) మాత్రం మహా నే(మే)తకూ ఆయన కొడుక్కు మాత్రమే ఒరిగింది, మేం నోళ్ళు కట్టుకున్నాం  అని మన ముదురు మంత్రుల్ అమాయకంగా మాట్లాడడం జనాల చెవిలో పువ్వులు పెట్టడమే!
   అదెలాగంటే - ఒప్పందాలను క్యాబినెట్  మొత్తం ఆమోదించినా దాన్ని వారి దృష్టికి తెచ్చి వివరించేది సంబంధిత శాఖ మంత్రే. ఒప్పందంలోని అంశాలను(లొసుగులు/ మతలబులు), రాయితీ ఒప్పందానికి, క్యాబినెట్  మెమోరాండానికి మధ్య తేడాలను ఇతర మంత్రులు అప్పటికప్పుడు అర్థం చేసుకోవడం కష్టం. ఆమాటకొస్తే అందరూ కలిసే నిర్ణయాలు తీసుకునేట్లయితే, స్వప్రయోజనాలేమీ చూసుకోనివారైతే నాకా శాఖ కావాలి, ఈ శాఖ వద్దూ అంటూ పేచీలెందుకు పెడతారు? (అప్పట్లో బొత్స్గారు ఎంతలా రంకెలేసారో కిరణ్ సారు కొత్తగా అపాయింటైనప్పుడు)
    వాన్ పిక్  సంస్థకు రాయితీలిచ్చే వ్యవహారంలో 72 పేజీల ఒప్పందాన్ని రూపొందించింది అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణే కాబట్టి ఒప్పందంలోని లోటుపాట్లను ఆయన క్యాబినెట్ పైకి నెట్టివేయలేరని కోర్టు కూడా వ్యాఖ్యానించింది.     ఒప్పందంలోని అంశాలను, రాయితీ ఒప్పందానికి, క్యాబినెట్  మెమోరాండానికి మధ్య తేడాలను ఇతర మంత్రులు అప్పటికప్పుడు అర్థం చేసుకోవడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది. ఆ వివరాలను మంత్రే క్యాబినెట్ కు చెప్పాలని కానీ వాన్ పిక్  వ్యవహారంలో మోపిదేవి అలా చెప్పకుండా కుట్రకు పాల్పడ్డారని సీబీఐ కోర్టు తెలిపింది.
   నిజానికి క్యాబినెట్ మీటింగుల్లో సంబంధిత శాఖామంత్రి" పైపైన" వివరించినదాన్నిబట్టి "సూత్రప్రాయ"అంగీకారం మాత్రమే తెలుపుతారు. ఆ" పైపైన" ఇచ్చే వివరణల్లోనే "పైవాళ్ళ అభీష్టా"లమేరకు "దేవ రహస్యాలను"దాచిపెట్టి మనం ఆ కంపెనీకి ఇన్నెకరాలిస్తే మన రాష్ట్రానికి ఇన్ని ఉద్యోగాలొస్తాయ్, ప్రభుత్వానికి ఇంత ట్యాక్సొస్తుంది (ఇంకొంచెం ముందుకెళ్ళి మన పార్టీకి ఇంత ఫండొస్తుంది, మీ అందరిళ్ళళ్ళకు ఇన్నేసి సుట్‌కేసులొస్తాయనే లెఖ్ఖలూ మాట్లాడుకుంటుండొచ్చు కానీ అది దేవ రహస్యం. ఇప్పుడు మనం కూడా దాని గురించి మాట్లాడకూడదు:))
    సో, ఎటూ ఈ పుండాకోరు ఎదవలు చెబుతోన్న' ఉమ్మడి'సొల్లు తప్పని తేలిపోయింది కాబట్టి ఇప్పటికైనా మన న్యాయ వ్యవస్థా, విచారణ సంస్థలూ నిబద్ధతతో వ్యవహరిస్తే మరో అయిదుగురు అక్రమార్కులు (అందులో ఇద్దరి మహిళా శిరోమణులున్నూ) చెంచల్‌గూడ దారిపట్టడం ఖాయం. అలా అయినా మరి కొన్నేళ్ళపాటు అడ్డగోలుగా మేళ్ళ మేత మెయ్యాలని చూసే కొడుకులెవరైనా భయపడి కాస్త వెనకడుగువేస్తే వై.ఎస్స్ లిద్దరూ ఈవిధంగానైనా సమాజానికి మేలుచేసినవారవుతారు:)
    ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం "ఒకవేళ వై.ఎస్ బ్రతికుండి కాంగ్రేసుని ఎదిరించియుంటేకూడా ఇలాగే జరిగుండేదా?"
    అసలు ఆయన బ్రతికుంటే కాంగ్రేసుని ఎదిరించే ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది అనే విషయాన్ని పక్కనబెట్టి (మరో పవార్ అవకూడదా ఏం?) ఒకవేళ అదే జరిగితే ఏమై ఉండేది? అని ఒకసారి అనుకుంటే.............. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటికొస్తాయి. వీటిపై మరోసారి చర్చిద్దాం.

Thursday, June 7, 2012

వాక్స్వాతంత్ర్యం, తొక్కా తోలూ అంటే నీ ఎక్కౌంటో, నీ కొడుకు ఎక్కౌంటో తేలుస్తాo అనుంటారేమో? అమ్మా న్యాయ దేవతా! నీ బిడ్డల్ని నువ్వే రక్షించుకో

         ఉప ఎన్నికలను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడే అవకాశం ఇప్పించాలని  హైకోర్టును కోరిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించిన విధంగానే నిరాశ ఎదురైంది. జగన్ చేసిన విజ్ఞప్తిపై ఉప ఎన్నికలు అయిపోయాక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు చెప్పడం విడ్డూరంగానూ, అసహజంగానూ ఉంది. హైకోర్టు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఈ నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేయడం ఏ సహజ న్యాయ సూత్రాలకిందకి వస్తుందో న్యాయకోవిదులే చెప్పాలి. 
         అయితే అనుమతి ఇవ్వడమో , లేదంటే కుదరదనో చెప్పడమో చేస్తే బాగుండేది. కాని హైకోర్టు స్థాయిలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సరైన పద్దతో తెలియదు.బహుశా ఏదో ఒక నిర్ణయం చేయడంలో ఉన్న ఇబ్బందిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు వాయిదా వేశారుకావచ్చని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు కాని హైకోర్టు నిర్ణయం సకాలంలో తీసుకోకపోవడం వల్ల అర్జీదారుకు ఉపయోగం ఉండదు, పైగా ఇది సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉండటం మాత్రం వాస్థవం.
       కొంతమంది ఇప్పటికే ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రేస్ న్యాయ మూర్తుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందనీ, బెయిల్/ మీడియా ఇంటర్వ్యూలకు పర్మిషన్ లాంటివాటి జోళికెళ్తే నీదికూడా పట్టాభి పరిస్థితే అవుతుందనేలా ఈ జడ్జినీ బెదిరించియుంటారేమో అనేలా భావించాల్సిన దుస్థితి దాపురించింది. లేకపోతే ఎవరైనా ఆకలవుతోంది అనివచ్చినోడికి తిండి ఉంటే పెడతా అనాలి, లేకుంటే లేదు అంటే మరొకణ్ణి అడుక్కుంటాడు. కానీ, పదిరోజులాగి రా అప్పుడు పెడతా అంటే వాడు పిచ్చినా.........అయినా అయ్యుండాలి లేక ఎవడో వాణి కొడుకు ఎక్కౌంటో, వాణి ఎక్కౌంటో తేలుస్తా అని బెదిరించి అయినా ఉండాలి!!  

Wednesday, June 6, 2012

కొత్త బిచ్చగాడు పొద్దెరుగునో లేదో తెలియదుగానీ, పాత బాబుకు మాత్రం బుద్ధిరాదు


        అవును మీ గెస్ కరక్టే. ఇక్కడ పాత బాబంటే మన చంద్ర బాబే:) పాత బాబని ఎందుకన్నానంటే - కార్యకర్తలతో,పార్టీ లీదర్లతోనేమో నేను మారాను, మీరూ మారండంటాడు, కానీ చేతల్లోనేమో అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాను, అడ్డదిడ్డంగానైనా నడుస్తానంటాడు. అందుకు ఉదాహరణ ఈ రోజు ఉప ఎన్నికల ప్రచారంలో చేసిన ఉ(అను)చిత వాగ్ధానాలు. నిన్న మొన్నటిదాకా ఏమయ్య కిరణ్ రూపాయక్కిలో బియ్యం ఎవడియ్యమంటే ఇచ్చావ్? కిలో బియ్యం కాదుగనీ రూపాయక్కిలో ఉప్పు ఇప్పించు చూద్దాం అని చాలంజ్ చేసాడు. ఇప్పుడదే నోటితో నేనధికారంలో కొస్తే పేదలకు బియ్యం ఉచితంగా ఈస్తా అంటున్నాడు. అంతేకాదు ఇళ్ళుకూడా కట్టిస్తాడట(అవీ ఉచితమేనట!). మరొకరు ఇస్తేనేమో పేదలను సోమరుల్ని చెయ్యడమట, అదే ఈయనిస్తే సముచితమట??
        ఆత్మ కధలలోనేమో ఉచితం ఎంత అనుచితమో, సబ్సిడీలను ఎత్తెయ్యడం ఎంత అత్యవసరమో చెప్తూ లెచ్చర్లిస్తాడు(బహుషా అది చదువొచ్చినోళ్ళకు మాత్రమే తెలుస్తది గాబట్టిన్నూ, ఆళ్ళెలాగ ఈయనకు వోట్లెయ్యరుగాబ్ట్టినున్నేమో?), ఓట్ల కాడికొచ్చేసరికి ఇప్పుడేమో అన్నీ ఉచితంగా ఇస్తా అంటాడు. 2009లోనే ఇలాంటి ప్రయోగం (కలర్ టీవీలిస్తాం, ఉచిత కరంటిస్తాం, తెలంగాణా ఇస్తామ్మ్.........అని ఊదరగొట్టి) చేసికూడా గూబగుయ్యిమనిపించుకున్నా ఈయనకింకా బుద్ధిరానట్లుందనుకోవాలా? లేక ఈయనకు జనాలు మరీ ఎర్రిపప్పల్లా ఎన్నిసార్లైనా పువ్వులు పెట్టించుకునేవాళ్ళలా కనపడున్నారా?? నీలాంటి బాబుల బాబులకే చుక్కలు చూపించిన చరిత్ర వాళ్ళది. జాగ్రత్త వాళ్ళ ముందుకెళ్ళి మాటిమాటికీ చరిత్రహీనుడివయ్యే ప్రయత్నం చెయ్యకు.

Tuesday, May 29, 2012

గురివింద సామెతను గుర్తు చేస్తోన్న ఈనాడు, జ్యోతి

     మన రాష్ట్రంలో, ఆమాటకొస్తే మొత్తం దేశంలో ఇప్పుడు ఓ కొత్త సిద్ధాంతం నడుస్తోంది. నానలుపు సంగతి  తర్వాతగానీ ముందు నీ నలుపు సంగతి చెప్పమన్న గురివింద సామెతలాగ.  పొలిటీషియన్ నుంచి పాలవాడిదాకా ఇదే వరస. పాలవాణ్ణి ఏరా! ఇంతలా నీళ్ళెందుకు కలుపుతున్నవురా అంటే, పోండయ్యా ఏదో ముప్పావు లీటర్లో పావు లీటర్ నీళ్ళు కలిపితేనే అంతలా గగ్గోలెడతారేంటి? నేనేమన్నా మన లీడర్లలా అసలు పాలే లేకుండా నీళ్ళుపోస్తున్నానా ఏంటి?? అని ప్రశ్నిస్తున్నాడు. పైగా తనదేమంత పెద్ద తప్పు కాదు ఫలానావాడితో పోలిస్తే అంటాడు:)
   ఇంతకీ విషయం ఏంటంటే - ఓపక్క కంపెనీ పెట్టీ పెట్టగానే, లాభల్లాంటివేవీ ఆర్జించకుండానే 10రూపాయల షేరును 350కి ఎల కొంటారు? మేళ్ళు పొందినవారే అలా చేసారని రామోజీ గుండెలు బాదుకుంటుంటే ఇక జగన్ కూడా ఈనాడు ప్రస్తావన తెచ్చి నష్టాలలో ఉన్న ఈనాడు షేర్ ను ఐదు లక్షల ఇరవైఎనిమిదివేలకు విక్రయిస్తే లేని తప్పు, తాను తన సాక్షి షేర్ ను మూడు వందల ఏభై రూపాయలకు అమ్మితే తప్పా అని కోర్టులో స్వయంగా చెప్పడం విశేషం.
    ఒకరకంగా ఇది మంచి ప్రశ్నే కావచ్చు. కానీ - ఇద్దరూ చేసింది తప్పే అనీ, ఎవడిస్థాయిలో వాడు మతలబులు చేసారనీ నమ్మే జనాలక్కావలసింది అదికాదు. వాడెలా చేసాడో వీడూ,వీడెలా చేసాడో వాడూ నిరూపిస్తే ఒకడి నెత్తిన  ఇంకొకడు భస్మాసుర హస్తం పెట్టుకున్నట్లవుద్ది. కానీ అలా చెయ్యరు. ఇక జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పేంత తక్కువస్థాయి కాదు రామోజీదన్నట్లు ముందుకొచ్చాడు ఒక ఎల్లో బ్రదర్ - కేశవ్. ఈనాడు ముప్పై ఐదేళ్లుగా శ్రమించి అభివృద్ది చెంది,ఆస్తుల బేస్ తయారు చేసుకోగా,సాక్షి అలాంటిదేమీ లేకుండా ముడుపుల ఆధారంగా పెట్టుబుడులు పెట్టిందని టిడిపి నేత కేశవ్ పేర్కొన్నారు.
      ఇలాంటిదే మరో ఘటన - ప్రధానిపై అన్నా బృందం ఆరోపణలు చేస్తే ఖండిచడానికి ముందుకొచ్చింది అవినీతికి అసలు సిసలు డిక్షనరీ అర్ధం లాలూ.
     మరోపక్క తన ఇలాకాలో పనిచేసే ఉద్యోగులను వలసకూలీలకన్నా నీచంగా చూసే, సహేతుకమైన వేతనాలివ్వాలంటూ వేజ్‌బోర్డ్ సైతం ఎన్నోసార్లు చేసిన సిఫార్సులను తుంగలో తొక్కిన రామోజీ మొన్న సాక్షి ఖాతాల స్థంబన, ఆస్థుల ఎటాచ్‌మెంట్ వార్తలురాగానే ఏకంగా ఇరవై శాతం జీతాలు పెంచాడట. ఇది ఎంత పైశాచికానందమో కదా! అదేమి విచిత్రమో కానీ ఒకప్పుడు సాక్షి పత్రిక పెట్టినందువల్లనే రామోజీ జీతాలు పెంచడం, ఇప్పుడదే సాక్షి మూతపడుతుందనే భ్రమతో మళ్ళీ జీతాలు పెరగడంతో ఈనాడు ఉద్యోగులు చచ్చి బ్రతికిన వై.ఎస్ నూ జైలుకెళ్ళిన జగన్నే ఎక్కువ తలచుకుంటున్నారట జీతాలిచ్చే రామోజీకి బదులుగా!!
    తనకు తాను మహా మేధావినని ఊహించుకునే నేరో హార్ట్(Narrow Heart) ఆర్కే పత్రిక ఏకంగా జగన్ ను ఇంటరాగేట్ చేసింది తానే అన్నట్లు "ఆదివారమ్ విచారణలో నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ ను ఉద్దేశించి నీవల్లే ఇదంతా వచ్చిందని అనడంతో జగన్ ఆయనపై ఫైర్ అయ్యారని, అంతేకాక సిబిఐ పై కూడా ఆయన దురుసుగా వ్యవహరించారని" వ్రాయడం, ఆపైన అటు జగన్ తరపు వారు ఇటు నిమ్మగడ్డ ప్రసాద్ తరపు వారు ఇద్దరూ ఈ కధనాన్ని తీవ్రంగా ఖండి0చడం ఆ పత్రిక గాలితీసినట్లయింది. (మొదటి రోజు నిమ్మగడ్డ ప్రసాద్ ను , జగన్ ను ఇద్దరిని కలిసి విచారించిన మాట నిజమే. కాని ఆదివారం నాడు అసలు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టలేదని ఇరువర్గాల వారు చెపారు).
    ఇలా ఎవడికి కావలిసిన గాలి వార్తలను వాడు సృష్టించి రాస్తున్నారుగానీ జనాలకు నిజాలు చెప్పేవాళ్ళు కరువైపోయారు!!!

Sunday, May 27, 2012

అరెస్ట్ కరస్టే! కానీ టైమింగ్ వరస్ట్!!కాదంటారా?


           ఉప ఎన్నికల ప్రచారం నేపధ్యంలో సిబిఐ కావాలని ఇలా కేసులో ఇరికించిందని, ప్రచారం చేయనివ్వకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నదని జగన్ ఆరోపిస్తుండగా, జగన్ చేసింది తప్పే - అతనికి శిక్షపడటం కూడా కరక్టే అని నమ్మే తటస్థులూ మేధావులుకూడా ఇదే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.
          ఒక కేసులో ఏ వన్ గా చూపినవాణ్ణి అరెస్ట్/ ప్రశ్నించడం చెయ్యడానికి చార్జ్‌షీట్లు దాఖలు చేసేసి కోర్ట్ కు హాజరు కమ్మని స్వయానా కోర్టే సమన్లు పంపిన తర్వాత, ప్రత్యేకంగా సీబీఐ ప్రశ్నించాల/ అరెస్ట్ చెయ్యాలనుకోవడం అవివేకమే.
        చార్జ్‌షీటుకు ముందు ప్రశ్నించి, అవసరమనుకుంటే అరెస్టైనా చేసుండొచ్చుకదా? పోయి పోయి ఉప ఎన్నికల ప్రచార హడావిడిలో ఉండగా ఈ తంతు చెయ్యడం నిజంగా వివేకమేనా? వ్యక్తి ఎలాంటివాడైనా, దొంగ సొమ్ముతో పార్టీ పెట్టాడనుకున్నా ఆయన్ను నమ్ముకుని ఓ డజనున్నరమంది ఉన్నప్పుడు వారికోసం ప్రచారం చేసుకోనివ్వకపోవడం ఏం నీతి? పోనీ ఈ 15రోజుల్లోనే ఆయన ఏదేశానికైనా పారిపోతారనుకున్నారా??
          ఆయనపై ఉన్న కసికొద్దీ ఎప్పుడైతేనేమి లోనేసెయ్యడానికి అనే వారికీ, ఆయన పెట్టిన పార్టీయే అవినీతి డబ్బుతో కనుకన్నూ, ఆయనకోసం పార్టీ ఫిరాయించినవారందరూ మహా అవినీతిపరులవ్వడంవల్లనూ వాళ్ళకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకొనేంత స్వేచ్ఛ కూడా ఇవ్వనవసరం లేదందామా అంటే - దేశంలో ఏపార్టీ స్వచ్ఛమైన డబ్బుతో/ మనుష్యలతో నడుస్తుందో చెప్పగలరా??
ఇక్కడ జగన్ చేసింది రైటనడంలేదు, అతన్ని ప్రశ్నించొద్దనలేదు, అరెస్టూ చెయ్యొద్దనలేదు. సమయం, సందర్భం విషయంలోనే నా ఆక్షేపణ.

Friday, May 25, 2012

జగన్ ను గుడ్లురుముతూ ప్రశ్నిస్తున్న సీబీఐ? భయంగా సమాధానాలిస్తున్న జగన్?? టీవీ9 పైశాచికత్వం!

         టైటిల్ చూస్తే ఎవరికైనా ఓ అనుమానం రాకమానదు. విచారణ మొదలయ్యి అరగంట కూడా కాలేదు, వీడేమైనా పుడింగా లోపల జరిగేది వీడెలా ఊహించగలడు? అని. కానీ, పరమ పైత్యకార చానల్ అయిన టీవీ9 మాత్రం కలగంది. కాదు కాదు తన లేకితనాన్ని బయటపెట్టుకుంది. దాదాపు గంట నుండి రోలింగ్ రజనీకాంత్ క్వశ్చన్ అవర్ పేరుతో ఆయాసం, ఆవేశాలతో సినిమా చూపించే మానసిక (రోగ) విశ్లేషకుడు (నర్సింగరావుతో) కలిపి రక్తికట్టిస్తున్న లైవ్ రిపోర్టింగ్ కు బ్యాక్‌గ్రౌండ్ గా ఇస్తున్న ఏనిమేషన్ లో పైవిధంగా చూపుతున్నారు. ఇది ఎంత కంపరం కలిగించేదిగా ఉందో అంతకన్నా వీళ్ళ రోతను బయటపెట్టేదిగా ఉంది.
        ఇహ తోకొక్కటే తక్కువైన మన హనుమంతప్ప (వీహెచ్), డిల్లీ స్థాయి నాయకుడంటారు - కానీ గల్లీకొచ్చి మీడియాతో మాట్లాడుతాడు. ఆయన గుంటూరులో ఇందాక మాట్లాడుతూ - చనిపోయిన రాజశేఖర రెడ్డినే అవినీతి చేసాడని నిర్ధారించిన సీబీఐ, అతనికి టీ కాఫీలందించిన సాధారణ అనుచరుడు (సూరీ)ని కూడా ప్రశ్నించిన సీబీఐ, వైఎస్ కు ఆత్మగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేవీపీ జోలికి ఎందుకు వెళ్ళడంలేదని? అదీ ఏదో మీటింగ్ లో ఒక కార్యకర్త తనకు ఆ ప్రశ్నవేస్తే, అప్పుడు అరెర్రె...నిజమే కదా అని ట్యూబు వెలిగిందట:) అదే విషయాన్ని గుంటూరు గల్లీల్లో మీటింగ్ పెట్టి అడిగిన ప్రశ్నే ఇరవై సార్లు అడిగేకంటే నీ స్థాయి (డీల్లీ?!) లో సోనియానో, సీబీఐ డైరెక్టర్ నో, కనీసం హైదరాబాదులో జేడీ లక్ష్మీనారాయన్నో నిలదీయకపోయావా తోకలేని తిక్కల హనుమన్నా అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట!!
        మరోపక్క జనాల చావులతో ఆడుకునే వికృత క్రీడ మళ్ళీ మొదలవనుందా? రాష్ట్రమన్నాక ఎక్కడో ఓచోట ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరు గుండెపోటుతో మఋఅణించడం లాంటీవన్నీ సర్వసాధారణం. కానీ వారంతా జన నేత, యువనేత, తొక్కా తోలూఅగాళ్ళకోసం పోయారంటూ వాళ్ళ చావుల్నికూడావాడోవడం దారుణం. ఇంకా నయం ఎవరూ చావకుంటే కొన్ని సినిమాల్లో చూపించినట్లు వీళ్ళే కొందర్ని చంపేసి తమ నేతకోసమే చచ్చాడనిపించే రోజులు కూడా వస్తాయేమోనని భయంగా ఉంది.

జగన్ను అరెస్ట్ చెయ్యడానికి ముందు తమవాణ్ణికూడా ఒకణ్ణి ఏసేసాము అని చెప్పుకోవడానికిమాత్రమే మోపిదేవిని అరెస్ట్ చేసారా?


        వ్యాన్‌పిక్‌ కుంభకోణంలో మోపిదేవి అరెస్టు ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, అది జరిగిన తీరూ, సమయమూ అనుమానించదగ్గవే. వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లుగా బహుశా ఒక పెద్ద పులిని పట్టుకునేందుకు ముందుగా ఒక మేకను బోనులో వేసినట్లుగా భావించవచ్చు.
ఇహ వో వైపు మొదట్లో సీబీఐ తీరును మెచ్చుకుని తెగ ముచ్చటపడిన నాలాంటివాళ్ళు కూడా ఇప్పుడు దాని పద్ధతినీ, పనితీరునూ అనుమానించాల్సి వస్తోంది. ఎందుకంటే, నిజంగా అది నిష్పాక్షికంగా, నిక్కచ్చిగా పని చేసేదయితే మొదట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టుబడిదారులకి లాభం కలిగించడానికి చేసిన అడ్డగోలు నిర్ణయాలెన్ని? వాటివల్ల ఎవరెవరు ఎంత దండుకున్నారు?? వంటి వాస్థవాలను ఏకమొత్తంగా వెలికితీసి, అంతిమంగా (అతి ఎక్కువగా) లాభపడ్డ జగన్ తోపాటూ అడ్డగోలు జీవోలకు కారకులైన ఆ అరడజను మంత్రులూ, ఐ.ఏ.ఎస్ (అయ్యా.ఎస్)లనూ అందర్నీ లోపల వెయ్యాలి. వాటికంటే ముందు ఈ పాత్రధారుల, సూత్రధారుల అందరి ఆస్థుల్నీ జప్తు చెయ్యాలి. అలా కాకుండా జగన్ ఆస్థుల మీద మాత్రమే కన్నెయ్యడం - అదీ మీడియా కు సంబంధించిన రోజువారీ ఎక్కౌంట్లవడం ......ఇవన్నీ జనాల్లో కాస్త అనుమానాల్ని లేవనెత్తేవే!
     ఇక్కడ జగన్ వి మాత్రమే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడం కాదుగానీ, దర్యాప్తు జరుగుతున్న తీరూ మరియు మెజారిటీ మీడియా చేస్తున్న రాద్ధాంతమూ ఎలా ఉందంటే వై.ఎస్ ద్వారా అకృత్యాలు చేయించి జగన్ ఒక్కడే లాభపడ్డాడనే అర్ధం వచ్చేలా ఉంది. జగన్ కేసులో అవినీతిగురించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే మొదట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టుబడిదారులకి లాభం కలిగించిందని నిర్ధారణ చేయవలసిన అవసరం లేదా?.ఎవరైనా నూరు రూపాయలు లాభం పొందితే పది రూపాయలు లంచం ఇచ్చే అవకాశం ఉంటుంది.ఆ విధంగా నూరు రూపాయలు అక్రమంగా లబ్ధి పొందిన వారు ఉన్నారని భావించి నప్పుడు వారి ఖాతాలను ఆస్తులను స్థంబింప జేయకుండా పది రూపాయల లబ్ధి పొందిన వారి ఆస్తులను సీజ్ చేయడంలో నైతికత ఉందా?
     తప్పుడు జీవోలు జారీ చేసేలా ప్రోత్సహించిన/ బలవంతపెట్టిన వై.ఎస్ (వాస్థవంగా ఆయన అవ్వాలి ఏ1, కానీ చచ్చి బ్రతికాడు. అసలాయనంటూ బ్రతికుండియుంటే కేసులెక్కడివీ, ఏ 1,2,3,...లెక్కడుండేవనేది వేరే విషయం), అతని పుత్ర రత్నమైనందుకు జగన్ లు మాత్రమే తప్పు చేసినవారిగా చూపడం గడసరితనమే అవుతుంది. అరెస్ట్ చెయ్యబడ్డ మోపిదేవినుండి, మద్యం సిండి 'కేట్' బొత్స వరకు అందరూ బుకాయిస్తున్నట్లు వీరంతా కేవలం వై.ఎస్ పై భక్తి/ భయం తో మాత్రమే సంతకాలు చేసారా? తమ సొంత లాభం ఏమీ చూసుకోకుండానే సంతకాలు చేసారా? అదే జరిగిందని నేడు వీళ్ళంతా కలిసి బుకాయిస్తే మనం నమ్మాలా? నేడు జగన్ను అరెస్ట్ చెయ్యడానికి ముందు తమవాణ్ణికూడా ఒకణ్ణి ఏసేసాము, మాకు వాడూ వీడనే తేడా ఏం లేదని చెప్పుకోవడానికిమాత్రమే మోపిదేవిని అరెస్ట్ చేసారుగానీ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే సగం కేబినెట్ జైళ్ళో ఉండేది. సుప్రీం కోర్ట్ మొట్టికాయ వేసేంతవరకూ ఆ ఆరుగురు పాపాత్ములకు కనీసం నోటీసులైనా ఇవ్వనివాౠ నేడు సడన్ గా ఒక మంత్రిని అరెస్ట్ చేసారంటే వీళ్ళ చిత్తశుద్ధిని ఎలా అర్ధంచేసుకోవాలి? అయినా ఊరకే వాళ్ళనరెస్ట్ చేసి మర్యాదలు చేస్తే ప్రజలకు ఒరిగేదేమిటి? ముందు వాళ్ళందరి ఆస్థుల్నీ జప్తుచేసి ప్రజల పరం చెయ్యండి (బీహార్లో నితీష్ కుమార్ చేసినట్లు).

Wednesday, May 23, 2012

దొంగతనం ఎందుకు చేసావురా అనడిగితే ఊర్లో ఉన్న దొంగలందర్నీ పట్టుకున్నాక నన్నడుగు అన్నట్టుంది మన లీడర్ల/ వాళ్ళ మూర్ఖ అభిమనుల తీరు!


      నాకెప్పటికీ అర్ధం కాని విషయం ఏంటంటే - దొంగ సొమ్ము తిన్నవాడు సమర్ధించుకోవడానికి వాడితంటాలేవో వాడు పడతాడు. కానీ, మన రాష్ట్రంలో నేతలకన్నా అభిమానుల తీరు విచిత్రంగా తోస్తోంది. ఓ పక్క జగన్ ఆస్థుల కేసులో అదే తీరు, ఇప్పుడు హౌసింగ్ స్కాం లో ఇరుక్కున్న స్వామి గౌడ్ విషయంలోనూ అంతే. ఒకడు సోనియాను వ్యతిరేకించాడు గనుక వాణ్ణి సతాయిస్తున్నారంటే, మరొకడు తెలంగాణా ఉద్యమ నాయకుడు గనుకనే ఇరికిస్తున్నారంటారు. అంటే మహానేత కొడుకనే పేరుతో ఒకడు, తెలంగాణా పేరుతో మరొకడు ఇలా ఎవడేమి చేసినా ఏమీ అనొద్దా? మహానేతా, కొడుకూ కలిసి మన మేకల్నే కోసుకు తిని వాళ్ళు మెక్కగా మిగిలిన బొక్కల్ని (సంక్షేమ పధకాల రూపంలో) మన మొహానవేస్తే, మరొకడు ఉద్యమం పేరుతో ఆస్థుల్ని పెంచుకుని, అమాయక విద్యార్ధుల్ని ఆత్మహత్యలకు పురికొల్పి, కేంద్రంతో ప్యకేజీలు కుదుర్చుకుని ఉద్యోగుల్ని నట్టేటముంచి ఉద్యమ కాడీ ఎత్తేసినోడు. వాణ్ణీ ఏమనొద్దు? వీణ్ణీ ఏమనొద్దు??
 గచ్చిబౌలి, గోపన్న పల్లి వద్ద తెలంగాణ ఎన్.జి.ఓల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సుమారు 240 ప్లాట్లను బినామీలపరం చేశారని స్వామి గౌడ్ పై ఆరోపణలు వస్తున్నాయి.అలాగే హైదరాబాద్ వారికి కాకుండా జిల్లాల ఉద్యోగులకు కూడా ప్లాట్లను చట్ట విరుద్దంగా కేటాయించినట్లు నిర్ధారణ అయింది. అయినా ప్రభుత్వం పైనే ఎదురు దాడి. ఇది ఆయనా, ఆయన పక్కనుండే చోటా మోటా నాయకులూ (?) చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎందరో చదువుకున్నవాళ్ళూ, విద్యాధికులు కూడ్డా తమకున్న ఉద్యమాభిమానంతో ఇలా సమర్ధించజూడటం బాధ కలిగిస్తోంది. ఇక జగన్ కేసులో కూడా బ్లాగుల్లో, ఇతరత్రా చూస్తే జగన్ ను సమర్ధించేవారూ, విమర్శించేవారూ రెండు వర్గాలుగా విడిపోయి (అవికూడా కమ్మ వర్గం, రెడ్డి వర్గాలుగా!) వీడొక్కడే చేసాడా? వాడు చెయ్యలేద?? వీడికంటే వాడే పెద్ద దొంగ..........లాంటి వితండవాదాలు చేస్తూ..ఎవరివాళ్ళను వాళ్ళు సమర్ధించుకోజూడటం....ఎంత అనాగరికమో అనిపిస్తోంది. 

Monday, May 14, 2012

'ఛీ'బీఐ అసలు గుట్టు విప్పిన మాజీ డైరెక్టర్ జోగిందర్


        అమెరికా లోని ఎఫ్.బి.ఐ తో తమను తాము పోల్చుకుని జబ్బలు చరుచుకునే సీ(ఛీ)బీ ఐ అసలు గుట్టు విప్పారు మాజీ డైరెక్టర్ జోగిందర్. అదేమంటే సీబీఐ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ,కేంద్రం చెప్పినట్లే చేస్తుంది. బహుషా అందుకేనేమో - మన స్వర్గీయ (మహా?) నేత ప్రతిదానికి తనకు తానుగా 'ఛీ'బీఐ ఎంక్వైరీ వేసుకునేవాడు?  
        సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్నడూ స్వతంత్రంగా వ్యవహరించలేదని, అది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే పనిచేయాల్సి ఉంటుందని సిబిఐ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు.సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్రంలో ఉన్న హోం శాఖ న్యాయ సలహాదారుల ద్వారా కేంద్రం కధ నడిపిస్తుంటుందని ఆయన వెల్లడించారు. ఒక్కసారి ఒక అబిప్రాయం చెప్పి, మరోసారి సిబిఐ ఆ అబిప్రాయాన్ని మార్చుకోవడంలో అసలు నేపధ్యం ఇదేనని జోగిందర్ కుండబద్దలు కొట్టారు.అయితే తెరపైకి కేంద్రంలో ఉన్నవారు కనిపించకుండా కధ నడిచిపోతుందని కూడా ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో కూడా సిబిఐ అలాగే వ్యవహరిస్తోందన్న భావన కలుగుతుంది.ఎమ్.ఆర్.కేసులో అరెస్టు అయిన ప్రముఖుల ఖాతాలు కాని, ఐ ఎఎస్ ల ఖాతాలు కాని స్తంభింప చేయకుండా, అసలు జగన్ పై ఎలాంటి ఆదారాలు దొరికాయో ఇంతవరకు చెప్పకుండా సిబిఐ నేరుగా సాక్షి మీడియా బ్యాంకు కరెంటు అక్కౌంట్ ఖాతాలను స్తంభింప చేసిన తీరు అనుమానాలకు తావు ఇస్తుంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేస్తూ జిఓ ఇవ్వడం కూడా ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారన్న సంకేతాన్ని ఇచ్చింది.అంతకన్నా మించిన ఉదాహరణ పరిటాల రవి హత్య కేసులో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ జగన్ పై వచ్చిన ఆరోపణలను విచారించడానికి ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడి సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు అదే సిబిఐ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ ను వెంటాడుతూ ఏకంగా ఆయన ఆస్తులపై దాడులు చేస్తోంది.జగన్ పై విచారణ చేయవద్దని ఎవరూ అనడం లేదు.మంత్రులు, ఇతర ప్రముఖులందరిని వదలి పెట్టి ఒక్క జగన్ పైనే గురి పెట్టడమో ఇందులో ఉన్న ప్రధాన లోపం. ఈ పరిస్థితులలో జోగిందర్ సింగ్ చెప్పింది వాస్తవం అనిపించడం లేదూ!

Saturday, May 12, 2012

గూగుల్, ఫేస్ బుక్కుల్లా కాకుండా లాభాల్లో వాటాలిస్తామంటున్న వాజబ్! మీరూ జాయినౌతారా?

గూగుల్, ఫేస్ బుక్...ఒక్క రూపాయి కూడా ప్రజలకు వెనక్కు ఇవ్వని సంగతి తెలిసిందే.
కానీ ఈ సైట్ లో జాయిన్ అయితే మీకు డబ్బులు చెల్లిస్తుందట.గూగుల్, ఫేస్ బుక్ వెబ్ సైట్లు కోట్ల రూపాయల ఆదాయం ప్రజల ద్వారా సంపాదిస్తున్నా ఒక్క రూపాయి కూడా
ప్రజలకు వెనక్కు ఇవ్వని సంగతి తెలిసిందే.జూలై నెలలో కొత్త కాన్సెప్ట్ తో ఒక
వెబ్ సైట్ లాంచ్ కానుందట. దీని పేరు
వాజబ్. ఈ సైట్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఈ సైట్ లో జాయిన్   అయ్యే యూజర్స్ కి పంచి పెట్టనుందట .

ఈ లింక్ నొక్కి మీరూ జాయిన్ అవ్వొచ్చు. Try your LUCK
జనాన్నీ, రాష్ట్రాన్నీ జగనే హత్యచేస్తాడా? పాపాత్ములను ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేసే కాంగ్రెస్ పార్టీ ఆల్రడీ చేసేసిందిగా?? శవాన్ని మళ్ళీ చంపడమేంటి???
(SATIRICAL ARTICLE only. Not to support anybody)రక్త పిశాచి అని, ప్రజలను హత్య చేస్తాడని లక్షల కోట్ల ప్రజా దనాన్ని కొల్ల గొట్టుతాడని తెలిసి YSR లాంటి పాపాత్ములను ముఖ్యమంత్రులుగా మరియు కేంద్ర మంత్రులుగా చేసిన....... నియంతలు, రక్త పిశాచాలు ఇందిరా , రాజీవ్ లను ప్రధాన మంత్రులను చేసి దేశం లో లక్షల సిక్కులనుఊచ కోత కోసిన,కాశ్మీర్ లో లక్షల హిందువులను ఊచ కోతకు కారణమైన, ఎమర్జెన్సీ విదించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ...దేశాన్ని కొల్లగొట్టి, సర్వ నాశనం చేసి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న ఈ దుష్ట కాంగ్రేస్ రాష్ట్రాన్నీ, దేశాన్నీ ఎప్పుడో హత్యచేసాక ఇప్పుడెవడో ఒక చిల్లర దొంగ వచ్చి కొత్తగా మళ్ళీ హత్య చేస్తాడనడం ఎంత హాస్యాస్పదం? 
           అలా నియమించబడ్డ మరో గులాంలా మాట్లాడుతున్నట్లనిపిస్తోంది.......మన మూణ్ణాళ్ళ ముఖ్యమంత్రి. 
నిన్న మొన్నటిదాకా యువనేతను పల్లెత్తి ఒక్కమాటైనా అనలేదీయన. అప్పటి లెఖ్ఖల ప్రకారం ఎవరెట్టాపోయినా 2014 వరకూ తననే కొనసాగిస్తారనుకున్నాడు. అప్పటికి ఖర్మ బాగాలేకపోతే అదే జగన్ గ్రూపులోకి తనూ వెళ్ళి ఏ కేంద్ర మంత్రో కావచ్చనుకున్నాడేమో! అందుకే ఏదో అండర్‌స్టాండింగ్ లో పోయినట్టున్నాడు! సివరాకరికి మేడం గారు క్లాసు పీకేసరికి ఆ పదవేదో ఇప్పుడే ఊడిపొయ్యేలాగుందని విమర్శలకు దిగినట్టున్నాడు.     
            ఎందరో బకాసురులను పెంచిపోషించి జనాలమీదికి వదిలిన ఈ పెద్దలకు ఆంధ్రాలో ఓ మహానేతతో పాదయాత్రలు చేయించి (పాపత్ముడితో పాద యాత్ర చేయించి మహాత్మా గాంధీ ని అవమానించారన్న మాట), జనాలతో జేజేలు పలికించి ముఖ్యమంత్రిని చేసినప్పుడు తెలియదా? పోనీ అప్పుడు శ్రీరామచంద్రుడనుకుని పొరబడ్డామనుకున్నా...తర్వాతర్వాత (చిల్లర) పధకాల పేరుతో జనాల్నెలా వంచిస్తోందీ, భూ పందేరాలూ, జల యజ్ఞం పేరుతో ధనయజ్ఞాలూ చేస్తున్నప్పుడు ఆయన కాబోయే ప్రజా కంటకుడని, ఆయన కొడుక్కి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నాడనీ ఎరగలేకపోయారా? ఓహో, తమ వాటా తమకండుతున్నంతకాలం అవేవీ కనిపించవన్నమాట?! కానీ పెద్ద నియంత పోయి చిన్న నియంత సీటెక్కుతానంటే కుదరదనుడెందుకు, తమ వాటాలేవో తాము తీసుకొని ఎవడో ఒకడు - జనాలను ముంచి తమ బొక్కసాలు నింపితే చాలనుకోకుండా ఆడ్ని కెలుకుడెందుకు? తేరగా ఇప్పుడు వాసన చుసుకుంటూ బాధపడతమెందుకు?? అయ్య మంచోడే కానీ కొడుకు రాక్షసుడంటూ జనాల ముందు కామెడీ షోలు చేస్తూ, పాపం తండ్రీలేని బిడ్డకు జనాలనుంచీ, (కొందరొ) మేధావుల(?) నుండీ మరింత ఓదార్పు అందేలా చెయ్యడమెందుకు???

Wednesday, January 4, 2012

I am back on Blog after 4 months & wish u all a Very Happy New Year


Dear Friends


I WITH MY FAMILY

WISH YOU AND YOUR FAMILY

A VERY LOVELY, LIVELY, LOVING
HAPPY, HEALTHY, PROSPEROUS AND WONDERFUL

NEW YEAR 2012

MAY YOU ENJOY EVERY MOMENT OF THE NEW YEAR
FRESH WITH ENERGY, ENTHUSIASM AND EMPATHY
TO SERVE OUR FELLOW BEINGS AND ABOVE ALL THE DEPRIVED
WITH ALL YOUR HEART AND SOUL

MAY THE SPIRIT OF MAITRI, KARUNA AND MUDITA THRIVE IN YOUR HEART

MAY YOU BE FRIENDLY TO MOTHER EARTH BY BEING ENVIRONMENT AND ECO-FRIENDLY

LOVINGLY YOURS

R.S.Reddy

Tuesday, October 18, 2011

ద్వేషాలతో సమైక్య రాష్ట్రం, అసత్యాలతో ప్రత్యేక రాష్ట్రం - తెలుగు ప్రజలకీ రెంటిలో ఏదీ శ్రేయస్కరం కాదు.


తెలంగాణా సెంటిమెంటులో ఉన్న నిజాయితీని గౌరవిస్తూ, విభజన కోరుకోవడానికిగల చారిత్రక కారణాలను విశ్లేషిస్తూ, విభజనను సీమాంధ్రులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ, కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ చింతనవల్లే సీమాంధ్ర ప్రాంతంలోని సామాన్యుల్లో విభజన అంటేనే అదేదో మిన్ను విరిగి మీద పడ్డట్లు అనే భావన కలిగిందనే నిజాన్ని విషదపరుస్తూ, అదే సమయంలో ఓ రాష్ట్ర విభజన అంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుని అవతలివాళ్ళ భయాలనూ-వనరుల పంపిణీవంటి క్లిష్టాంశాలనూ ఉభయామోదయుతంగా పరిష్కరించుకోవాలనే ఇంగితం కొరవడిన నేతల చేతల్లో తెలంగాణా ఉద్యమం పడడంవల్ల ప్రజల మద్య సరిదిద్దలేని విభజన ఎలా ఏర్పడిందనే విషయాలమీద నేను మరో విష్లేషణాత్మక వ్యాసం రాద్దమనుకుంటున్న టైంలో శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు గారు దాదాపుగా అవే అంశాలతో ఓ మంచి విశ్లేషణాత్మక వ్యాసం వ్రాసారు. అది నాకు బాగా నచ్చింది. అందుకే దాన్ని ఇక్కడ మిత్రులతో చర్చకోసం ఉంచుతున్నాను. ఇందులోకూడా ఏవైన తప్పుబట్టదగ్గ, లేదా విభేదించదగ్గ విషయాలుంటే చర్చకు సిద్ధం:
       ద్వేష,విద్వేషాల మధ్య ఒక సమైక్య రాష్ట్రాన్ని నడపగలమా?విబేధాలు, తగాదాలు, ఆవేశ,కావేశాల మధ్య ఒక రాష్ట్రాన్ని ఇదే విధంగా పాలించగలరా? ప్రతిదానికి అనుమానాలు, పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సహ జీవనం సాగించగలరా? సమైక్య రాష్ట్రం కొనసాగడానికి ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు ఏ మాత్రం అనువుగా లేవని అందరికి తెలిసినా ఎందుకో మొండి పట్టుదల, పంతాలు, పట్టింపులతో తెలుగు సమాజం మొత్తం దేశ ప్రజల ముందు నవ్వుల పాలవుతోంది. అయినా ఈ నేతలకు ఏ మాత్రం జ్ఞానోదయం కలగడం లేదు. సమైక్య రాష్ట్రవాద నేతలే కాదు. ప్రత్యేక రాష్ట్ర వాద నేతలదీ ఇదే పరిస్థితి మొత్తం తెలంగాణ సమాజం అంతా తీవ్రంగా నష్టపోతున్నా,తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం సమస్యలన్నీ హాంఫట్ అవుతాయన్నంత సినిమా చూపుతూ ప్రజలను భ్రమలలో ఉంచుతున్నారు. ఏభై లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని, ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ద్వేష, విద్వేషాలతో సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం ఎంత నష్టమో, అలాగే అసత్యాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే ప్రమాదం. నిజమే. ఇలాంటి వాదనలు అటు సమైక్యవాదులకు రుచించవు. ఇటు ప్రత్యేక వాదులకు రుచించవు, యదార్ధవాది లోక విరోధి అన్నారు. ఇప్పుడు ఎవరైనా నిజాలు చెబితే ఇబ్బందే. అయినా కొన్ని నిజాలు కొందరికైనా తెలియాల్సిందే.
                     ముందుగా సమైక్య వాద నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. రెండువేల నాలుగులోకాని, రెండు వేల తొమ్మిదిలోకాని తెలంగాణ నేతలంతా ఆయా పార్టీలవారంతా తెలంగాణ రాబోతోందని, తెలంగాణ జెండాలపై పార్టీ ముద్రలు వేసుకుని తిరిగినప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరూ అభ్యంతర పెట్టలేదు. సరికదా! ఎంత చక్కా అధికారంకోసం తెలంగాణ పేరు చెప్పి ఓట్లు తెచ్చుకుంటున్నామని సంతోషించారు.కాంగ్రెస్ నేతలుగా ఉన్న ఎమ్.పిలు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టిజివెంకటేష్, జెసి దివాకరరెడ్డి.. తెలుగుదేశం నేతలు ఎర్రన్నాయుడు, మైసూరారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు ఇలా వీరిలో ఎవరన్నా ఆ రోజులలో అభ్యంతరం చెప్పారా? పైగా తెలుగుదేశంలో అయితే అభిప్రాయ సేకరణ జరిపామంటూ ఒక తంతు నిర్వహించి తెలంగాణ ఇచ్చేసుకోండని తీర్మానం చేసిన కమిటీలో ఎర్రన్నాయుడు, యనమల వంటి వారు ఉన్నారు. వారి నాయకుడు చంద్రబాబు అయితే మీరు తీర్మానం పెడితే మేము మద్దతిస్తామంటూ జోరుగా మాట్లాడేవారు. తీరా కేంద్రం ప్రకటన చేశాక ఈ సీమాంద్ర నేతలంతా ఒక్కసారే రివర్సయ్యారు. ఇదంతా సీమాంధ్ర నేతల స్వయంకృతాపరాదం అని చెప్పకతప్పదు.తీరా రాష్ట్ర ప్రకటన వచ్చాక ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య శాసనసభలో ఎందుకు తీర్మానం పెట్టలేదు?తీర్మానం ఆమోదించడమో, తిరస్కరించడమో చేసి ఉంటే ఈ సమస్య అంతా కేంద్రానికి బదిలీ అయి ఉండేది. ఆమోదించి ఉంటే గొడవే లేదు. తిరస్కరించి ఉంటే అప్పుడు కేంద్రం ఎలా స్పందించి ఉండేదో. లేదా తెలంగాణ ఉద్యమ నేతలు ఎలా వ్యవహరించి ఉండేవారో.కాని అలా కాకుండా మొత్తం గందరగోళంలోకి నెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి జరుగుతున్న కష్టనష్టాలకు కాంగ్రెస్ పార్టీనే బాద్యత వహించాల్సి ఉంటుంది.రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన పాపం వారిదే అవుతుంది. మంచో, చెడో కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నందున దానికి కట్టుబడి తదుపరి చర్యలు చేపట్టి సీమాంద్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఉంటే ఉబయ ప్రాంతాలకు ఇంత నష్టం జరిగి ఉండేది కాదేమో. కొద్ది రోజులు సీమాంద్రలో అలజడి ఉన్నా, హైదరాబాద్ కు సంబంధించి, అలాగే నదీ జలాలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి కేంద్రం తన ప్రతిపాదనకు కట్టుబడి ఉంటే పరిస్థితి మారేదేమో. ఆ పని చేయకుండా రెండు ప్రాంతాలలో ఉద్యమాలు చెలరేగేలా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తెలివితక్కువగా వ్యవహరించింది. దీంతో మొత్తం రాష్ట్రం అంతటా ద్వేష,విద్వేషాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఒకరిని చూస్తే మరొకరికి అనుమానం, వీరు ఏ ప్రాంతం వారో తెలుసుకుని మాట్లాడవలసిన దౌర్బాగ్య పరిస్థితి. తప్పును తప్పుగా, ఒప్పుగా మాట్లాడలేని దైన్య స్థితి. సీమాంధ్ర నేతలను తెలంగాణ నేతలు, తెలంగాణ నేతలను సీమాంధ్ర నేతలు నిందించుకునే వైనం ఇవన్ని చూస్తే రాజకీయాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి ఏర్పడింది.ఇంత జరిగినా సీమాంధ్ర నేతలు ఎందుకు సమైక్య రాష్ట్రం కోరుతున్నారో అర్ధం కాదు. నిజానికి కోస్తా కాని, రాయలసీమ కాని అనేక రంగాలలో వెనుకబడి ఉన్నాయి. లక్షల సంఖ్యలో ప్రజలు వలసలు వెళ్లారంటేనే అక్కడ ఉపాధి అవకాశాలు ఏ రకంగా దెబ్బతిన్నాయో అర్దం చేసుకోవచ్చు. అక్కడ అబివృద్దిపై ఈ నేతలెవ్వరూ దృష్టి పెట్టడం లేదు. పైగా దిక్కుమాలిన రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.వచ్చే పరిశ్రమలు రానివ్వకుండా తగాదాలు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలతో నిత్యం ఘర్షణ పడుతూ మొత్తం రాజకీయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఏదో విదంగా తెలంగాణ నేతలతో అవగాహన కుదుర్చుకుని ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనపోతే సీమాంద్ర నేతలు ఆ ప్రాంతానికి తీరని ద్రోహం చేసినవారవుతారు.
               ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండు చేస్తున్న నేతల గురించి చూద్దాం. కారణం ఏదైనా తెలంగాణ రాష్ట్రసమితిని ఏర్పాటు చేసి పదేళ్లుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతూ, అన్ని రాజకీయ పార్టీలను తనదారిలోకి తెచ్చుకున్న ఘనత ఆ పార్టీ అదినేత కెసిఆర్ దే. అంతేకాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కొందరు ఎమ్.పిలను తన మద్దతుదారుల్లా ఉండేలా చేసుకున్న ఘనత కూడా కెసిఆర్ దే. కాంగ్రెస్ నేతలను ఎంతగా లొంగ తీసుకున్నారంటే, కెసిఆర్ ను ఏ సీమాంద్ర నేత విమర్శించినా, వారిని టిఆర్ఎస్ నేతలకన్నా ముందుగా అంతకన్నా తీవ్రంగా విమర్శించేలా చేయగలిగారు. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నా టిఆర్ఎస్ కు , తెలంగాణ జెఎసికే ఎక్కువ విదేయతగా ఉండేలా చేసుకోవడం వరకు సఫలీకృతం అయ్యారు.కాంగ్రెస్ నేతలను తీవ్రంగా కెసిఆర్ దూషించినా ఫర్వాలేదులే అన్నంతగా చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇంతగా అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ నేతలను పూర్తిగా నమ్మడానికి లేదని అంతా అంటారు. ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ నేతలను తనదారిలోకి తెచ్చుకున్నట్లు డిల్లీలోని కాంగ్రెస్ నేతలను ఇంకా తన మార్గంలోకి తెచ్చుకోవడంలో కెసిఆర్ సఫలం కాలేకపోయారు. అలాగే కెసిఆర్ అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడుతున్న మాట నిజమేకాని, తమ పదవుల వరకు వచ్చేసరికి, పార్టీ వరకు వచ్చేసరికి పూర్తిగా వదులుకోలేకపోతున్నారు. వారందరిమీద ఒత్తిడి తేవడానికే తెలంగాణ జెఎసి నేతృత్వంలో సకల జనుల సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. సకల జనులంటే అన్ని వర్గాల ప్రజలు ఏరకంగా సమ్మె చేస్తారా అన్న అబిప్రాయం ఉండేది. కాని తీరా చూస్తే ఆర్గనైజ్ డ్ సెక్టార్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసి ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, ఇలా ప్రభుత్వంలోని వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులందరిని సమ్మెలోకి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. కాని ప్రజలకు దీనివల్ల చాలా అసౌకర్యం కలుగుతున్న మాట నిజమే. అంత మాత్రాన మొత్తం సమ్మెకు అనుకూలమని ఉద్యమ నాయకత్వం భావిస్తే మాత్రం అది తప్పని చెప్పకతప్పదు. నిజమే. తెలంగాణ ఆకాంక్ష సర్వత్రా ఉండవచ్చు. అందులో భిన్నాభిప్రాయం లేదు. కాని సమ్మెకు కూడా అంతా అనుకూలమేనని అనుకోవడానికి వీలులేని పరిస్థితి కనబడడం లేదు. సమ్మెకు ఇష్టపడి కొందరు సమ్మె చేస్తుండవచ్చు. కాని అనేకమంది భయపడి చేస్తున్నారు.ఉద్యమ కారులు చేసే బెదిరింపులకు లొంగి చేస్తున్నారన్నది వాస్తవం. తెలంగాణ నేతలు చర్యల వల్ల తెలంగాణ రైతులతోపాటు అన్ని ప్రాంతాల రైతులు ముఖ్యంగా విద్యుత్ పై ఆధారపడే వారు బాగా నష్టపోతున్నారు.విద్యార్దులు మాత్రం తెలంగాణలోని వారే నష్టానికి గురి అవుతున్నారు.రవాణా సమ్మె వల్ల తెలంగాణలోని పేద,దళిత ,బలహీనవర్గాలవారికి ఎంత కష్టం వస్తున్నదో చెప్పజాలం. ప్రపంచం అంతా ఒక గ్రామం మాదిరి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న ఈ తరుణంలో రాష్ట్రంతో సకల సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేయడం ద్వారా కొంతకాలం ప్రజలను నమ్మించవచ్చు.ఎల్లకాలం అది సాద్యపడదు. నినాదాలు వినడానికి బాగానే ఉంటాయి. కాని ఆచరణ వచ్చేసరికే అందులోని సమస్యలు తెలుస్తాయి. తెలంగాణ వస్తే ఏభై లక్షల ఎకరాలకు నీరు వస్తుందని చెబుతుంటారు. అలాగే ఐదు లక్షల ఉద్యోగాలు వస్తుంటాయి. ఇవన్ని అసత్యాలు, ఆచరణసాధ్యం కాని విషయాలే ప్రచారం చేశారు.ఇప్పుడు ఆవేశంలో జనం వీటిని నమ్మినా కొన్నాళ్ల తర్వాతైనా అసలు వాస్తవం తెలుసుకోలేకపోరు. అప్పుడు వచ్చే భవిష్యత్తు సంగతేమో కాని, ఇప్పుడు మాత్రం లక్షల ఎకరాలు ఎండిపోతుంటే, లక్షలాదిమంది విద్యార్ధులు చదువులు లేక వారి భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటే ఉద్యమ నేతలు మానవత్వంతో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పకతప్పదు. వచ్చే ఉద్యోగాల సంగతేమోకాని, ఇప్పుడు బంద్ ల కారణంగా పోయే ఉద్యోగాల సంగతి, కాలే కడుపుల గురించి కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం అన్నది ఒక ఆకాంక్ష. దానికి ప్రజాస్వామ్య లక్షణం తేగలిగారు. అత్యధిక ప్రజలు కోరుకుంటున్న సంగతిని రుజువు చేయగలిగారు.అంతవరకు బాగానే ఉంది. ఏ ప్రజలైతే తెలంగాణాను కోరుకుంటున్నారో వారినే అవస్థల పాలు చేయడం మాత్రం వ్యూహ రీత్యా కొంతకాలం వరకు బాగానే ఉన్నట్లు కనిపించినా, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయోజనం చేకూరదు. ఒక్కసారి ప్రజలు ఎదురు తిరగడం మొదలైతే అప్పుడు ఉద్యమం మొత్తంగా దెబ్బతింటుంది. గతంలో ఇలాంటి అనుభవాలు టిఆర్ఎస్ నేతలకు ఎదురైన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కనుక తెలివిమంతుడుగా పేరొందిన కెసిఆర్ మరింత తెలివిగా తన వ్యూహాలను మార్చుకుని ప్రజలందరి అభిమానాన్ని చూరగొనగలిగితేనే ఆయన ఉద్యమానికి సార్ధకత వస్తుంది.లేకుంటే నిజంగానే ఆయన చెబుతున్నట్లు తెలంగాణ వచ్చినా ప్రజలకు ఆయనపై అభిమానం పెరగకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సీమాంద్రులపై ఎన్ని నెపాలు మోపినా ప్రయోజనం ఉండదు.ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంద్ర నేతలు ఆహ్వానించి ద్వేష,విద్వేషాలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలి. అలాగే తెలంగాణ ఉద్యమ నేతలు ప్రజలకు ఉద్యమాలంటే విరక్తి కలిగేలా కాకుండా జాగ్రత్తపడాలి.ఎందుకంటే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఈ డ్రామాను ఎంతకాలం నడుపుతుందో అర్దం కాకుండా ఉంది . అందువల్ల తెలుగు జాతి కలిసి ఉన్నా, విడిపోయినా ఈ లోగా పరస్పర ద్వేషాలతో రగిలిపోకూడదనే విజ్ఞులైన వారంతా కోరుకోవాలి.


(Courtesy: Sri Kommineni Srinivasa Rao garu)

Friday, September 9, 2011

చిత్తశుద్ధి ఉంటే అవినీతి నిర్మూలన అసాధ్యమేమీ కాదని నిరూపిస్తున్న ఉత్తమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.


      దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం అవినీతి నిరోధంలో మరో అడుగు ముందుకేసింది.అవినీతి కేసులలో బుక్ అయ్యే అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించి , ఆ మేరకు చట్టం ఆమోదించిన ప్రభుత్వం , దానిని అమలు చేసి చూపింది. అయితే ఆ చట్టం పై సుప్రింకోర్టులో వివాదం పెండింగులో ఉన్నప్పట్టికీ నితీష్ ప్రభుత్వం ఒక ఐఎఎస్ అధికారి ఆస్తిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందులో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విశేషం.శివశంకర్ వర్మ అనే అధికారి ఒక అవినీతి కేసులో పట్టుబడి సస్పెండయ్యారు. ఆయన ఇంటిపై విజిలెన్స్ దాడి చేసినప్పుడు కోటినలభై లక్షల రూపాయల విలువైన స్థిర,చరాస్థులు ఉన్నట్లు కనుగొన్నారు. కొత్త చట్టం ప్రకారం విచారణ దశలోనే ఇలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధనను పెట్టడంతో వర్మకు పాట్నాలోని దానాపూర్ లో ఉన్న భవనాన్ని జిల్లా అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. అయితే కేసు పూర్తి అయి నిందితుడు దోషి అని తేలకుండానే ఆస్తి జప్తు చేయడం కరెక్టేనే అన్న విషయంపై సుప్రింకోర్టు లో కేసు పెండింగులో ఉంది. అయినప్పట్టికీ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నవాతావరణం దృష్ట్యా నితీష్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా ఈ భవనాన్ని స్కూలు కు వాడాలని ప్రతిపాదించగా, కొందరు ఇలాంటి జప్తు చేసిన ఇళ్లను రాత్రి షెల్టర్లుగా ఉపయోగించి, ఇళ్లులేనివారికి ఆవాసంగా ఉపయోగించాలని కొందరు సూచిస్తున్నారు.ఆ ప్రతిపాదనను కూడ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరో పది కేసులు ఇలాంటి తరహావి ఉన్నాయని చెబుతున్నారు.
       ఇహ ఉత్సవ విగ్రహంలా పేరుకు తనమటుకు తాను నీతిమంతుడైతే చాలన్నట్లు, మిగతావాళ్ళు ఎవడేది దోచుకున్నా నాకేంటన్నట్లు ఉన్న మన పేరుగొప్ప ప్రధానికన్నా మనసుంటే మార్గం ఉందకపోదన్న తీరుగా తనకుతోచినంతలో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తున్న నితీష్ ఎంతైనా అభినందనీయుడే కాదా?  

Thursday, September 8, 2011

దెబ్బకు దిమ్మదిరిగి, మైండ్ బ్లాంక్ అయిన యువనేత! కాళ్ళబేరానికొచ్చినా కనికరించేదిలేదంటున్న సోనియమ్మ!!జనం చెవుల్లో రంగురంగుల పూలు!!!

       నడిచినంతకాలం నా అంతవాడులేడని విర్రవీగిన "గాలి"చిప్పకూడుతినకతప్పని నిజాన్ని కాస్త ఆలస్యంగానైనా గ్రహించే జగన్ దారికొచ్చాడో లేక ప్రస్తుతానికి ఏవో నాలుగు గాలి మాటలు చెప్పి ఉచ్చు మరింత బిగుసుకోకుండా చూసుకోవాలనుకుంటున్నాడో తెలియదుగానీ ఇన్నాళ్ళూ ఆవేశంగా సోనియాను తిట్టిపోసిన జగన్ అదే కాంగ్రేసుతో అంటకాగడానికి సిద్ధమని ప్రకటించేసాడు. 
     ఢిల్లీలో మకాం వేసిన జగన్.. తొక్కని గడపంటూలేదన్నవిధంగా ప్రతిపక్ష పార్టీల నేతలందరివద్దకూ వెళ్ళి మొరపెట్టుకున్నా మద్దతుదొరికే పరిస్థితి కానరాకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ గా పనిచేస్తోందని..ఉద్దేశపూర్వకంగానే తనపై కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని లేఖలో జగన్ ఆరోపిస్తూ మద్దతుకూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఓ పక్క అవినీతిపై పోరు పేరుతో అన్నా టీం కొట్టిన దెబ్బకు కాంగ్రేస్ విలవిల్లాడుతుంటే ఈయనకు మద్దతుపలికి తామూ ఆతానుముక్కలమేనని జనాలతో అనిపించుకోడానికి మిగతావారుమాత్రం ఎవరుముందుకొస్తారు?
       ఇహపోతే అసలు జగన్ ఇంత సడన్‌గా యూపీయేకు అనుకూలంగా మాట్లాడ్డం వెనుక ఉన్నది కేవలం అరెస్ట్ భయమేనా? లేక మరో కారణమేమైనా ఉందా?? మాటతప్పని మడమ తిప్పని వంశోద్ధారకుడైన ఈయన ఇంత సడన్‌గా మాటమార్చడం వెనుక ఆంతర్యం మరోటుంటుందేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇన్నేసి బీరాలు పలికిన ఈయనను నమ్ముకొని పార్టీలోంచి బయటకొచ్చిన మిగతా బకరాలు (ఎమ్మెల్యేలు/ఎం.పీ లూ) ఏమైపోతారు? 
       ఈవిషయాలన్నీ తెలియకుండానే ఈయన ప్లేటుమార్చాడా? కాదనే చెప్పొచ్చేమో? ఆయన నేషనల్ మీడియాలో (మాత్రమే) తన మనసులోనిమాటను అలా బయటపెట్టాడోలేదో కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి ఒకరు ఆయన మద్దతు మాకవసరం లేదని చెప్పడంకూడా కాంగ్రేసు్‌మార్క్ రాజకీయ డ్రామానే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ జనాల్లో తనపై ఉన్న సానుభూతినీ, తన వర్గ ఎమ్మెల్యేలనూ దూరంచేసుకుని మరీ కాంగ్రేసువైపు తిరిగి వెళతాననేంత అమాయకుడని మనం జగన్ ను అనుకోడానికిలేదు, మరోపక్క తనని తిట్టిపోసినవాళ్ళతో శాస్వత శత్రుత్వం నెరపేంత పరిశుద్ధ పర్టీ కాంగ్రేసనీ భావించలేం. మమత, పవార్ లాంటివాళ్ళందరి మద్దతూ తిరిగితీసుకున్న ఘన చరిత్రకాదా వారిది?? అందుకే నేననుకుంటాను-సోనియా అసలు సీబీఐ తో సోదాల డ్రామా ఆడించిందే జగన్ అనే ఓ పిల్లకాకికి తన ఉండేలు దెబ్బ పవరేంటో చూపించిమరీ దారికి తెచ్చుకోవడంవరకేనేమో, ఆ తంతు కాస్తా అవగానే ఈయన దారికొస్తే కేసులు గీసులు ఎత్తెయ్యడమూ, అవసరమైతే అదే సీబీఐ తో క్లీన్ చిట్ ఇప్పించడమూ వారికేమంతకష్టమైన పని కాదుగా? దయానిధి మారన్‌కు ఇచ్చిన క్లీన్ చిట్ ఏపాటి "క్లీనో" మనందరికీ తెలియదా? 
         ఒక అంచనా ప్రకారం-గత కొన్ని నెలలుగా జగన్ వర్గపు ఎం.పీ ఒకాయన (సబ్బం హరి అని భోగట్టా) నెరపిన రాయభారం, సీబీఐ తెచ్చిన వత్తిడి ఫలితమే జగన్ మడమ తిప్పడం" కావచ్చు. మరైతే ఈయనకు ఏదో ఒక హామీ లభించకుండానే మాటతప్పేందుకు సిద్ధమయ్యాడా? కాకపోవచ్చనే చెప్పొచ్చు. ఈపాటికి ఆయనకు అధిస్టాణం వద్దనుండి క్షమాభిక్షకు అభయం  లభించేయుండవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు కాంగ్రేసులో తిరిగి చేరితే చేరిన ఈయనా, చేర్చుకున్న ఆమె జనాల దృష్టిలో పలచన అవుతారుగనుక ఇంకొన్నినాళ్ళు ఈ డ్రామాను ఇలాగే కొనసాగించి 2014 నాటికి ఈయన పార్టీ మరో ప్రజా రాజ్యం కావొచ్చన్నమాట. అందుకే ఈయన ఆ విధంగా ముక్తాయించారేమో? (అదేనండీ - ఓ పవార్, మమతల్లాగా అవసరమైతే యూపీయేకే తమ మద్దతు అని).       

Tuesday, September 6, 2011

ఇన్నాళ్ళకు పోకిరి సినిమాలోని క్రిష్ణప్రసాద్ అలియాస్ పండును నిజ జీవితంలో చూడగలిగాం. హేట్స్ ఆఫ్ లక్ష్మీనారాయణా....నీలాంటోళ్ళు నలుగురుంటే చాలు....అవినీతి డేగలకు ఉచ్ఛ్హలుపోయించొచ్చు!


అక్రమ సంపాదనతో అటు కర్నాటక ప్రభుత్వంలో, కమలం పార్టీలో చక్రం తిప్పి మరోపక్క ఆంధ్ర్‌ప్రదేష్ లో మరో జగన్నాటకాన్ని నడిపించాలనుకున్న 'గాలి' ఎట్టకేలకు చంచల్‌ గూడ జైలు పాలైయ్యారు. ప్రజా ధనాన్ని, జాతి సంపదను జాతరలో ఫ్రీగాపోసే పానకంలా తాగేసిన ఈ "ఘనుడి"కి ఏనాటికైనా ఆగతి పట్టకపోదని అందరం భావించిందే అయినా ఇంత తొందరగా మన కల నెరవేరడానికి కారకుడుమాత్రం సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ. అతని సమర్ధతకు, నిక్కచ్చితనానికీ ఇదొక నిదర్శన్ణం. ఓపక్క జగన్ విషయంలో ఆయన మెరుపువేగంతో చేస్తున్న దర్యాప్తును తట్టుకోలేక వై.ఎస్ వివేకా ఆయనకు ప్రతిపక్షనేతలతో చుట్టరికాలంటగడుతూ, పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించి తన లేకిబుద్ధిని చాటుకోగా ఈయన తొణక్కుండా కేవలం కేశవులుకూ నాకూ ఏ సంబంధమూ లేదనే ఓ చిన్న స్టేట్మెంటిచ్చి తనపని తను చేసుకుపోవడం చూస్తే అతని సిన్సియారిటీకి హేట్సాఫ్ చెప్పాల్సిందే అనిపిస్తుంది. సోమవారం మధ్యాహ్నం సిబిఐ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురంలో అక్రమ మైనింగ్‌ జరపడంతో పాటు అటవీ భూముల్ని కొల్లగొట్టిన కేసులో సాక్ష్యాధారాలు ఉన్నందునే వీరిద్దర్ని అరెస్టు చేశామని, విచారణలో దోషులని తేలితే మరి కొంతమందిని అరెస్టు చేస్తామని, అక్రమ మైనింగ్‌ తవ్వకాల్లో ఎవరెవరి పాత్ర ఉందో వెలికి తీసిన తర్వాత మరి కొంత మందిపై చర్యలుంటాయని ఆయన తెలిపారు. ఈ కేసులో భూగర్భ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజ్‌గోపాల్‌, సీనియర్‌ అధికారి శ్రీలక్ష్మీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
       ఇక గాలి చరిత్రలోకి ఒక్కసారి వెల్తే - అనతి కాలంలోనే వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన గాలి జనార్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో కర్నాటక బిజెపికి ఇం'ధనం'గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా కూడా వ్యవహరించిన 'గాలి' ప్రస్థానం ప్రస్తుతానికి చంచల్‌ గూడ జైలుకు చేరుకుంది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డితో పాటు ఆయన సమీప బంధువు, ఓఎంసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిద్దరికి సిబిఐ న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
         సోమవారం తెల్లవారుజాము నుండే ఈ నాటకీయ పరిణామాలు ప్రారంభమయ్యాయి. సిబిఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని పది మంది సభ్యుల బృందం సోమవారం తెల్లవారుజామున కర్నాటకలోని బళ్లారిలో గాలి జనార్ధన్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డిని వారి స్వగృహాలలోనే అదుపులోకి తీసుకుంది. హైడ్రామా మధ్య వీరిని ప్రశ్నించడానికి సిబిఐ అధికారులు హైదరాబాద్‌ కార్యాలయానికి తరలించారు. రాష్ట్ర సరిహద్దుల నుండే వీరి వాహనాలను మీడియా వాహనాలు వెంటాడాయి. సిబిఐ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారించిన అనంతరం మీడియా దృష్టిని మరల్చిన అధికారులు వీరిద్దరినీ వెనక ద్వారం గుండా నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు తరలించారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన విచారణ అంనతరం రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే బెయిల్‌ కోసం వీరి తరపు న్యాయవాది ఉమామహేశ్వ రరావు తొమ్మిది పిటిషన్లు దాఖలు చేశారు. జనార్ధన్‌రెడ్డి నిర్దోషని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని, కేవలం ఒఎంసి ఛైర్మన్‌ కావడంతో అరెస్టు చేశారని, అందుచేత ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని వాదించారు. కాగా జనార్ధన్‌రెడ్డి వెయ్యికోట్ల మేరకు అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగించాలని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వాదనలు విన్న కోర్టు నిందితులకు రిమాండ్‌ విధిస్తూ విచారణను వాయిదా వేసింది. గాలి జనార్ధన్‌రెడ్డి తరపున ఉమామహేశ్వరరావుతో పాటు 11 మంది న్యాయవాదుల బృందం బెయిల్‌ పిటిషన్లను దాఖలు చేసింది. జనార్ధన్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డిని విచారించి, అదనపు సమాచారం సేకరించేందుకు గాను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ పెట్టుకున్న పిటిషన్‌తో పాటు నిందితులు పెట్టుకున్న బెయిలు పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.
           చరిత్ర :ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు గతంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో రోశయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించాలని 2009 నవంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో సిబిఐ విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసును నిలిపివేయాలంటూ గాలి జనార్ధన్‌రెడ్డి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. 2010లో హైకోర్టు స్టే ను  అధికారులు తొలగించగలిగారు.
ఈ సెక్షన్ల ప్రకారం
గాలి జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురిపై 120 బి, 420, 379, 411, 427, 447 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13 (2), 13(1) (ఏ), గనులు, ఖనిజ సంపద చట్టంలోని 4 (1), 4(2), ఏ 23, అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం 26 సెక్షన్ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అక్రమ మైనింగ్‌ కేసుతో సంబంధం ఉన్న భూ గర్భగనులు, అటవీ శాఖ అధికారులపై కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది. వీటిలో గాలి జనార్ధన్‌రెడ్డిని తొలి ముద్దాయిగా సిబిఐ పేర్కొంది. రెoడో నిందితుడిగా ఓఎంసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని పేర్కొంది.
భారీగా నగదు... బంగారం స్వాధీనం ... హెలికాప్టర్‌ సీజ్‌
   సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని 11 మంది అధికారులు మూడు బృందాలుగా బళ్లారి, బెంగుళూరోల్లోని గాలి జనార్ధన్‌రెడ్డి, ఓఎంసి ఎండి శ్రీనివాస్‌రెడ్డి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో జనార్ధన్‌రెడ్డి నివాసంలో మూడు కోట్ల రూపాయల నగదు, 30 కేజీల బంగారు నగలు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెంగుళూరులోని పారిజాత అపార్ట్‌మెంట్‌లో నుంచి నాలుగు పుస్తకాలు, ల్యాప్‌టాప్‌, ఓ డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో కోటిన్నర రూపాయల నగదు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు హెలికాప్టర్‌, కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్ధన్‌రెడ్డితో సంబంధం ఉన్న పలువురు అటవీ, భూ గర్భగనుల శాఖల అధికారుల ఇళ్లల్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇదిలావుండగా మైనింగ్‌ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్త గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులను ఇటీవలే దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఇనుప ఖనిజం స్మగ్లింగ్‌ ద్వారా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్‌ నుంచి 215 కోట్ల రూపాయలను గాలి సోదరులు అక్రమంగా ఆర్జించినట్లు లోకాయుక్త ఆరోపించిన విషయం తెలిసిందే. కర్ణాకట లోకాయుక్త ఇచ్చిన నివేదిక ఆధారంగా గాలి జనార్ధన్‌ రెడ్డిపై సిబిఐ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలావుండగా ఓబుళాపురం గనుల్లో గాలి జనార్ధన్‌రెడ్డి జరిపిన ఖనిజ తవ్వకాల విలువ రూ.7,500 కోట్లుగా సిబిఐ నిర్ధారించింది. గనుల్లో వెలికితీసిన ఇనప ఖనిజం నాణ్యత, పరిమాణం ఆధారంగా ఈ విలువను లెక్కించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.
(Courtesy: Prajashakti)

Thursday, September 1, 2011

అవినీతి నిర్మూలనపై మనందరిలో (హజారే తో సహా)ఉన్న నిర్లిప్తతను నిర్మూలించకుంటే జనలోక్‌పాల్ కూడా ఓ మామూలు చట్టమే కాగలదు సుమా!

         ముందుగా అవినీతిపై పోరాటంలో అన్నా టీం (ఆమాటకొస్తే అశేష భారతావనీ ఐకమత్యంగా)సాధించిన విజయానికి జేజేలు పలుకుదాం. అప్పటి స్వాతంత్ర్య పోరాట ఉద్యమం తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు గానీ ఇంతపెద్ద ప్రజా ఉద్యమం జరగలేదంటే అతిశయోక్తికాదేమో! ఇంతపెద్ద విజయం వెనుక మేధావులూ, యువతా, ముఖ్యంగా మీడియా పాత్ర ఎంతో ప్రశంశనీయం. చిన్న చిన్న స్కూలు స్థాయినుండి కాలేజీ విద్యార్ధులవరకూ ఐ.టీ ఉద్యోగులనుండి ముంబయి డబ్బావాలాలవరకూ అందరూ చూపిన చొరవతోనే జనలోక్‌పాల్ వైపు మరో ముందడుగుపడడం, తోలుదొడ్డు ప్రభుత్వం మెడలు వంచగలగడం జరిగింది.
(నా కూతురు అన్నా హజారేకు మద్దతుగా తన స్కూల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఓ ప్రాజెక్ట్‌కు అందరి ప్రశంశలూ అముకున్నరోజే హజారే దీక్ష ఫలించినరోజు కావడం నాకు ఇంకా సంతోషకరమైన విషయం) 
          (నేనూ, కొందరు మా ట్రస్ట్ సభ్యులమూకూడా అన్నాకు సపోర్ట్‌గా దీక్షల్లో పాల్గొన్న ఫోటోలు ఇక్కడ )

          మనదేశంలో అవినీతి ఎంతలా వేళ్ళూనుకుని పోయిందంటే అవినీతిపై అవిస్రాంత పోరాటం చేస్తున్న ఉద్యమకారుల్లోకూడా కొందరు తెలిసో తెలియకో అవినీతి మచ్చలంటించుకుంటున్నారు. మరీ విచిత్రమైన విషయమేంటంటే మనలో చాలామంది అవినీతి అంటే పక్కనవాడు చేసే లంచగొండి వ్యవహారమనే భావిస్తున్నాం కానీ నైతికతను కోల్పోయి మనపని సాధ్యమైనంత తొందరగా అయిపోతే చాలనే ఆత్రుతలో అవతలివాడికి ఇవ్వాల్సిన మొత్తంకంటే ఎక్కువ ఇచ్చైనా పనులుచేయించుకోవడం లాంటివిమాత్రం మనకు అవినీతి/అవినీతిని ప్రోత్సహించడంలా అనిపించడం లేదు. ఓ గవర్నమెంట్ అధికారో, ట్రాఫిక్ పోలీసో తీసుకునే వెయ్యి మనకు లంచంగా కనిపిస్తుంది కానీ, మనం నో పార్కింగ్‌లో వాహనం పెడితే అదే పోలీసువచ్చి 500/-లకు చాలాన్ రాస్తానంటే వద్దని ఓ వంద అతని జేబులో పెట్టి బయటపడటం మాత్రం నీతిమాలిన పనిలా అనిపించదు.
        మనలో చాలామందిమి ఈ కోవలోకే వస్తాము. అంతెందుకు అన్నా హజారే టీములో ముఖ్య సభ్యుడైన శాంతిభూషన్ ఇంకా స్వామీ అగ్నివేష్ ల పై వచ్చిన ఆడియో టేపుల వ్యవహారంలోకూడా అతని వ్యవహారం అనుమానాస్పదం కాదని చెప్పే పరిస్థితి లేదు. ఇహ అవినీతిపై సినీ ఫక్కీలో దీక్ష చేసిన హైటెక్ యోగా బాబా రాందేవ్ పై ఉన్న ఆరోపణల సంగతి సరేసరి. అంతెందుకు హజారే పుట్టినరోజు వేడుకలకు ఆయన ట్రస్ట్ నిధులను దుర్వినియోగపరిచారనే ఆరోపణలు రావడమూ బాధాకరమే. ఇక్కడ అన్నాజీ కి ఆ విషయం తెలిసే అనుమతించాడనో, అలాంటి నీతిమాలిన పనికి ఆయన ఆమోదం ఉందనో అనుమానించడం నా ఉద్దేశ్యం కాదు. అయితే అవతలివాళ్ళకు ఓ న్యాయం, తనదాకావస్తే మరో న్యాయం తరహా సగటు మనిషి వ్యవహారశైలికి ఇంతపెద్దవళ్ళుకూడా అతీతులుకాదేమో అనిపిస్తుంది. అసలు డబ్బులు ఎక్కడినుండి ఖర్చు చేస్తున్నారనే విషయం తనకు తెలిపినా తెలుపకపోయినా అన్నా తన జన్మదినవేడుకల పేరుతో తన అనుచరులు చేయతలపెట్టిన కార్యక్రమాన్నే అనుమతించేదిలేకుండెనేమో!
అందుకే నాకనిపిస్తున్నదేమంటే అవినీతి విషయాన్ని కాసేపు పక్కనపెడితే అనైతికతపై మనకున్న నిర్లిప్తతను వీడకపోతే జన లోక్‌పాల్ కావచ్చు, జన లోకాయుక్త కావచ్చు ఇలాంటి చట్టాలెన్ని తెచ్చినా అవికేవలం కాగితాలకే పరిమితమవ్వచ్చు. అంతెందుకు వాటిని పటిష్టంగా అమలుపరచాల్సిన లోక్‌పాల్/ లోకాయుక్తలను వెతుక్కోవడానికే మనం బూతద్దాలను పట్టుకుని బయలుదేరాల్సిరావచ్చు. మనం ఎంతో గప్పగా కీర్తిస్తున్న ఎలక్షన్ కమీషన్ కూడా ఎందరు(కొందరు)ప్రబుద్ధుల చేతిల్లోపడి ఎంత నవ్వులపాలైందో ఈ మధ్య కాలంలోనే చూడలేదా? శేషన్ తర్వాత అందరూ శేషన్లే రాలేదు కదా??
           అందుకే బిల్లులూ, చట్టాలతోపాటూ జనాల్లో నైతిక ప్రవర్తనా, హక్కులూ బాధ్యతలపై అవగాహనా తెప్పించడంకూడా అంతే ముఖ్యం. లేకుంటే ఎంతో గొప్ప గొప్ప నీతిసూత్రాలతో రంగరిoచి తయారుచేసిన రాజ్యాంగాన్నయినా మనోళ్ళు ఎలా అటకపై పడుకోబెట్టి తమకు నచ్చిన రీతిలో రాజ్యమేలుతున్నారో, అలాంటి అధోగతే ఈ చట్టాలకూపట్టకపోదు.

Monday, August 15, 2011

పంద్రాగస్ట్‌ గతసారిలా మరో ఆదివారం నాడు రానందుకు సంతోషించిన నాకు మాపాప స్కూళ్ళో లంచ్ with చికెన్ బిర్యానీ ఉండడం షాక్ కలిగించిన వైనం

      నా బ్లాగులో మొదటి టపాగా గత పంద్రాగస్టున  63 యేళ్ళ స్వతంత్ర భారతం-దిగజారుతున్న విలువలు అనే టపాలో  జాతీయ పండుగల రోజున నాన్ వెజ్ అమ్మడం తినడం, మందు అమ్మకం తాగడం నిషేదించబడ్డా కొంతమంది దాన్ని తుంగలోతొక్కడంగురించి  "మనం శనివారం మందు తాగకూడదు/ మాంసం తినకూడదు అనుకున్నాం అంటే ఎంతో నిష్టతో పాటిస్తాం. అందుకు విరుద్ధంగా గానీ చేసామంటే అదేదో మహా పాపమనీ, దేవుడికి కోపం వస్తుందనీ భావిస్తాం. ఉన్నాడో లేడో తెలియని (అఫ్కోర్స్ ఎవరి నమ్మకం వారిది, అది తప్పుకాదు) దేవుడు విషయంలో వుండలేనిది మనలో చాలామందిమి ఒక జాతీయ పండుగకోసం ఒక్క ఆదివారాన్ని ఒదులుకోలేకపోయామే. ఈ ఒక్క ఆదివారం చుక్కా, ముక్కా లేకపోయినంత మాత్రాన ఏమీ చచ్చిపోంకదా అని మాత్రం అనుకోలేకపోయామే" అంటూ వాపోయిన విషయం గుర్తుచేసుకుంటూ ఈ పంద్రాగస్టు మరో ఆదివారoనాడు రానందుకు సంతోషిద్దామనుకున్న నేను మా పాప స్కూళ్ళో (పేరుకు పేద్ద పబ్లిక్ స్కూలే)పేరెంట్స్కూ టీచర్స్‌కూ మద్య క్రికెట్ మ్యాచ్, ఆతర్వాత లంచ్ ఉందంటే వెళ్ళి షాక్‌కు గురయ్యాను. కారణం-లంచ్ లో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఉండడం. అంత పెద్ద పబ్లిక్ స్కూళ్ళోకూడా ఇలాజరగడమేమిటా అని ఆరాతీస్తే ప్రిన్సిపల్‌గారు చల్లగా చెప్పిన విషయం ఏంటంటే PTA (Parent Teacher Association)వారు ఏర్పాటుచేసిన విందట అది.
       ఎవరు ఏర్పాటుచేసినా నాలాంటివాడు ఈవిషయాన్ని ఏ మీడియా చెవిలోనో పడేస్తే పోయేది మీపరువే కదా?    అందుకే స్కూళ్ళో ఏం జరుగుతుందో మీకు తెలియదనడం సరికాదు, అందుకు బాధ్యులెవరో తెలుసుకుని ఇలాంటివి పునరావృతంకాకుండా చూసుకోండని గట్టిగా చెప్పివచ్చాను. దానితోపాటు స్కూళ్ళో జరుగుతున్న మరికొన్ని అనుచిత వ్యవహారాలగురించికూడా కొన్ని సలహాలు ఇచ్చివచ్చాను. చూడాలి ఎంతవరకూ పాటిస్తారో?!   

Monday, August 8, 2011

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారా? - వివరాలు


గత టపాలో కొన్ని ఫోటోలను ఇచ్చి విషయమేమై ఉంటుందో ఊహించుకోండి? వివరాలు తదుపరి టపాలో వ్రాస్తాను" అన్నానుకదా.ఆ వివరాలు ఇప్పుడు మీకోసం: 

1.ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారా?


ఈ ఫోటో మొన్నామధ్య బోణాల సందర్భంగా ఓ గుడిముందు ఉఫయం 11గంటలప్పుడు తీసింది. దీన్ని కాస్త బాగా గమనించండి. ఆ గుడిముందున్న పెద్ద లైటూ, గుడిచుట్టూ ఉన్న డెకరేషన్ లైట్లూ ఎలా సూర్యునితో పోటీ పడుతున్నాయో?
అదండీ సంగతి. కరంటు ఫ్రాగా వచ్చింది. ఆ లైట్లు పెట్టినవాడుగానీ పెట్టించినవాడుగానీ బిల్లూ గట్రా కట్టేదేమీ లేదు. అంతా ఓ.సీ. దేవుడిపేరుమీదా, జాతరపేరుమేదా అంతెందుకు ఒక్కోసారి మంత్రులూ ఎమ్మెల్యేల మీటింగులూ ఇలా ఒకటేమిటి దేనికయినా ఫ్రీ కరంటును లైన్లకు కొక్కేలు తగిలించే మనం కనీసం దాన్ని అవసరమైనంతసేపే వాడుకుందామన్న ఇంగితాన్నికూడా ప్రదర్శించడంలేదు. అదే మన ఇంట్లో అయితే తెల్లవారీ వారకముందే లైట్లుబందు చేసి కర్టెన్లు తెరుస్తాం-బిల్లు తగ్గించుకోడానికి. మరి ఇక్కడ ఫ్రీగా వచ్చిందికదా అని పట్టపగలైనా బంద్ చెయ్యం. ఇదెక్కడి న్యాయం. ఇలాంటివాళ్ళంతా ఫ్రీగావస్తే ఫినాయిల్ కూడా తాగే రకాలేకాదా? అన్నట్లు ఈ ఫోటో తీసింది కూకటపల్లి మెయిన్ రోడ్డుమీద. ఈ తంతు అక్కడొక్కచోటే అనుకుంటే పొరపాటేనండోయ్:) నేను రామాంతపూర్ లో మొదలయ్యి జె.ఎన్.టీ.యూఅ కూ వెళ్ళేదారిలో దాదాపూ ప్రతిచోటా ఇదే తంతు(ఓ పదిచోట్ల చూసుంటా ఇలా).
2.రోడ్లమీదికి బండ్లు, కార్లూ వేసుకొని వెళ్ళడం పాపమా ??
ఇక మిగతా ఫోటోల్లో రోడ్డు డివైడర్లమీదనుంచి నానా విన్యాసాలూ చేస్తూ వెళుతున్నవారిని చూసారా? వీరు చేస్తున్న నిర్వాకమేంటంటారా? జీబ్రా క్రాసింగులూ, పాదచారుల సిగ్నల్ పడేదాకా ఆగి రోడ్డు క్రాస్ చెయ్యడాలూ లాంటి ఏనాగరిక పద్ధతులతోనూ పనిలేకుండా ఎవడికి అవసరమైనచోట, ఎవడికితోచినట్లు వాళ్ళు రోడ్డు దాటడం, వాహనాలకు అడ్డంగా ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు వేసి వారిని కంఫ్యూజ్ చేసి యాక్సిడెంట్లు చెయ్యడం/చేయించుకోవడం. అదేంటి నడిచి వెళ్ళేవాడు ఏక్సుడెంట్ చెయ్యడమేంటి అంటారా? మరదే విచిత్రం. అమీర్‌పేట చర్మాస్ ప్రాంతంలో ఒకడిలాగే రోడ్డు దాటుతూ  బైక్ పై వచ్చేవాడితో భరతనాట్యమూ, నాగినీ నృత్యమూ ఆడాడు. ఫలితం-వాణ్ణి తప్పించబోయి బైకిస్ట్ డివైడర్పై ఘోరంగా పడ్డాడు. అదృష్టవశాత్తూ అతను రోడ్డుపై పడ్డాడు, బైకు డివైడర్కు గుద్దుకుంది. 
ఇలా రొడ్లపైకి అడ్డంగా, అడ్డగాడిదల్ల దూసుకొస్తూ ఎక్కడపడితే అక్కడ రోడ్డు క్రాస్ చేసేవాళ్ళని నేను రోజూ చూస్తూనే ఉన్నా ఇలావాళ్ళవల్ల ఒకవ్యక్తి చావుకుదగ్గరగా వెళతాడని ఊహించలేదు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూద్దామని నేను ఎస్.ఆర్ నగర్ నుండి మూసాపేట్ వరకూ నాకారు డ్రవింగ్ చేస్తూనే మొబైల్ కు పని చెప్పాను. ఫలితం ఇన్నేసి ఫోటోలు అడ్డంగా రోడ్లు దాటుతున్న ఇందరేసి అడ్డగాడిదల్ని పట్టేసాయి.
ఓ పక్క సిటీ రోడ్లపై వాహనలు నడపడమంటే సర్కస్ చేసినంత కష్టమైపోతుంటే, మాటిమాటికీ బ్రేకులువేసి మైలేజీకూడా రాక జేబులకు చిల్లులుపడుతుంటే తమపని అయిపోతే చాలు ఎవడెటుపోతే మాకేంటన్నట్లు ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటేవారివల్ల ఈ వాహనదారుల ఇక్కట్లు మరింతపెర్గుతాయి. నిజానికి, వీరు కేవలం సిగ్నళ్ళదగ్గర అదీ ఆకుపచ్చ మనిషి బొమ్మ సిగ్నల్ పడ్డప్పుడుమాత్రమే రోడ్డుదాటాలి. అలా జరగాలంటే ఏం చెయ్యాలి? సడన్‌గా జనాన్నందర్నీ నాగరికుల్ని ఎలాగూ చెయ్యలేం. పోనీ అసలు ఎన్ని సిగ్నళ్ళవద్ద ఆ వ్యవస్థ ఉంది? మిగతా చోట్ల రోడ్డు దాటకుండా చేసేందుకు డివైడర్లవెంట ఏమైనా మెష్లాంటి అడ్డంకులు పెట్టాలా? లేక రోడ్లపైకి బండ్లూ, కార్లూ వేసుకుని వచ్చేవాడు వాడి ప్రారబ్ధమనుకుని ఊరుకోవాలా? ఏమిటి పరిష్కారం?